మాజీ ప్రధాని దేవెగౌడకు భారీ జరిమానా

Deve Gowda Ordered To Pay Rs 2 Crore To NICE In Defamation Case - Sakshi

బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడకు బెంగళూరు కోర్టు భారీ జరిమానా విధించింది. పరువు నష్టం కేసులో రూ.2 కోట్లు చెల్లించాలని దేవెగౌడను ఆదేశించింది. 2011 జూన్‌లో ఓ కన్నడ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కారిడార్‌ ఎంటర్‌ప్రైజ్‌పై దేవెగౌడ వ్యాఖ్యలు చేశారు. పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ సదరు సంస్థ ప్రతినిధులు కోర్టులో పరువు నష్టం పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన ధర్మాసనం.. నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ. 2కోట్ల జరిమానా చెల్లించాలంటూ ఆదేశాలు ఇచ్చింది.

కాగా, నష్టపరిహారంగా దేవెగౌడ నుంచి రూ.10 కోట్లు ఎన్‌ఐసీఈ కంపెనీ డిమాండ్ చేసింది. ఇక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కారిడార్‌ ఎంటర్‌ప్రైజ్‌పై ఇంటర్వ్యూలో చేసిన తన వాదనను ధృవీకరించడంలో దేవెగౌడ విఫలయ్యారని కోర్టు తేల్చింది. ప్రాజెక్టు కోసం అవసరమైన దానికంటే ఎక్కువ భూమిని వినియోగించిందని దేవెగౌడ చేసిన ఆరోపణలు సరికాదని కంపెనీ తరపు న్యాయవాది వాదించారు.

చదవండి: గోడను బద్దలు కొట్టి.. రూ.55 లక్షలు దోపిడీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top