ఎన్నికల బరిలో సినీ నటి రాధిక 

Radhika Sarathkumar Will Enter In Tamil Politics Over Assembly Elections - Sakshi

శరత్‌కుమార్‌ వ్యాఖ్య 

బీజేపీలోకి కరాటే 

సాక్షి, చెన్నై: సినీ నటి రాధిక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఎస్‌ఎంకే నేత శరత్‌కుమార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. నటిగా రాధిక అందరికీ సుపరిచితురాలే. భర్త  శరత్‌కుమార్‌ నేతృత్వంలోని సమత్తువ మక్కల్‌ కట్చి మహిళా విభాగం ఇన్‌చార్జ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. శరత్‌కుమార్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాధిక పోటీ చేయనున్నారని ప్రకటించారు. అన్నాడీఎంకే కూటమిలోనే ఉన్నామని, అధిక సీట్లు ఆశిస్తున్నామని ప్రత్యేక చిహ్నంపై పోటీ చేస్తామన్నారు. 

బీజేపీలోకి కరాటే.. 
కాంగ్రెస్‌లో ఏళ్ల తరబడి శ్రమించిన నేత కరాటే త్యాగరాజన్‌. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినానంతరం రజనీకాంత్‌ పార్టీ ప్రకటన కోసం ఆశగా ఎదురుచూశారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు.  దీంతో త్వరలో ఆయన బీజేపీలోకి చేరడం ఖాయం అని మద్దతుదారులు పేర్కొంటున్నారు.  

రాహుల్‌ పర్యటనలో మార్పు.. 
తొలి విడత ఎన్నికల ప్రచారాన్ని ముగించిన రాహుల్‌గాంధీ మలి విడతకు సిద్ధమయ్యారు. 14 నుంచి ఆరు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే, 14వ తేదీ ప్రధాని రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన నున్నారు. దీంతో రాహుల్‌ పర్యటనలో స్వల్పమార్పులు తప్పలేదు. ఈనెల పదిహేను తర్వాత రాహుల్‌ పర్యటన తేదీ ప్రకటించనున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top