మందుబాబు ఆత్రం.. రూ1.5ల‌క్ష‌లు గోవింద‌

Pune Cops Help Man Who Lost Rs 150000 While Ordering Beer Online - Sakshi

పుణెలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌

ఆన్‌లైన్‌లో బీర్ ఆర్డ‌ర్‌

రూ.1.5ల‌క్ష‌లు స్వాహా చేసిన సైబ‌ర్ కేటుగాళ్లు

పోలీసుల చోర‌వ‌తో త‌ప్పిన న‌ష్టం

ముంబై: క‌రోనా క‌ట్ట‌డికి మ‌హారాష్ట్ర‌లో లాక‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. ఇంటి నుంచి కాలు బ‌య‌ట‌పెట్ట‌కుండా ఉండాలంటే చాలా క‌ష్టం. ఇక మందు బాబుల‌ది మ‌రో ర‌క‌మైన బాధ‌. చుక్క ప‌డ‌క‌పోతే.. న‌రాలు లాగేస్తాయి. ఇలాంటి వారి కోసం ప‌లు ఈ కామ‌ర్స్ సంస్థ‌లు ఆన్‌లైన్‌లో మ‌ద్యం అందుబాటులోకి తెచ్చాయి. ఈ క్ర‌మంలో ఓ వ్య‌క్తి ఆన్‌లైన్‌లో బీర్ ఆర్డ‌ర్ చేయడానికి ప్ర‌య‌త్నించి ల‌క్ష‌న్న‌ర పొగొట్టుకున్నాడు. వెంట‌నే పోలీసుల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌డంతో న‌ష్ట‌పోకుండా బ‌య‌ట‌ప‌డ‌గ‌లిగాడు. 

ఆ వివ‌రాలు.. పుణెకు చెందిన‌ 55 ఏళ్ల వ్య‌క్తి ఒక‌రు ఆన్‌లైన్‌లో బీర్ ఆర్డ‌ర్ చేయ‌డానికి ఓ ఈ కామ‌ర్స్ సంస్థకు కాల్ చేశాడు. తొలుత రిజిస్టేష‌న్ ఫీజు కింద 10 రూపాయ‌లు చెల్లించాడు. ఆ త‌ర్వాత స‌ద‌రు కంపెనీ అత‌డి నంబ‌ర్‌కు ఓ యాప్ లింక్‌ను సెండ్ చేసింది. దాని ద్వారా డ‌బ్బులు చెల్లించాల్సిందిగా సూచించింది. దాంతో బాధితుడు యాప్ ఒపెన్ చేసి.. డ‌బ్బులు చెల్లించ‌డానికి పిన్ నంబ‌ర్ ఎంట‌ర్ చేయ‌గా.. అత‌డి అకౌంట్ నుంచి 1,50,009 రూపాయ‌లు డిడ‌క్ట్ అయిన‌ట్లు మెసేజ్ వ‌చ్చింది. వెంట‌నే ఆ వ్య‌క్తి ఆల‌స్యం చేయ‌కుండ సైబ‌ర్ క్రైం టీమ్‌ను సంప్ర‌దించాడు. 

వారు అత‌డి నంబ‌ర్‌కు వ‌చ్చిన బ్యాంక్ మెసేజ్‌ను వెరిఫై చేసుకుని.. నిందితుల అకౌంట్‌కి డ‌బ్బులు క్రెడిట్ కాకుండా ఫ్రీజ్ చేయ‌గ‌లిగారు. ఈ సంద‌ర్బంగా సైబ‌ర్ క్రైం టీం అధికారు ఒక‌రు మాట్లాడుతూ.. "స‌ద‌రు ఈ కామ‌ర్స్ సంస్థ పంపిన యాప్ ఒక రిమోట్ డివైజ్‌కు అయి ఉంటుంది. ఒక్కసారి యాప్ ఒపెన్ చేశామంటే మ‌న ఫోన్ కంట్రోల్ మొత్తం సైబ‌ర్ కేటుగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. ఇక వారు అకౌంట్‌లో ఉన్న కాడికి ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకుంటారు. అయితే బాధితుడు వెంట‌నే మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించ‌డంతో.. డ‌బ్బులు న‌ష్ట‌పోకుండా చూడ‌గ‌లిగాం. వారాల వ్య‌వ‌ధిలో డ‌బ్బులు అత‌డి అకౌంట్‌లోకి వ‌స్తాయి" అని తెలిపారు. 

చ‌ద‌వండి: కుక్కకు ఉద్యోగం.. నెలకు 15 లక్షల జీతం!

కాపాడుకోగ‌లిగాడు కి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top