పుదుచ్చేరి సీఎం రంగస్వామికి కరోనా పాజిటివ్‌

Puducherry CM Rangasamy Tested Coronavirus Positive He Admitted Hospital - Sakshi

పుదుచ్చేరి:పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌. రంగస్వామి కరోనా బారినపడ్డారు. ఈనెల 7వ తేదీ సాయంత్రం పదవీ ప్రమాణం చేసిన వెంటనే ఆయన విధుల్లో చేరారు. తాజాగా జ్వరం రావడంతో ఆయన కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకుని.. పాజిటివ్‌గా తేలడంతో  సోమవారం చెన్నైలోని ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. ఆయనతో సఖ్యతగా మెలిగిన ఎమ్మెల్యేలకు కూడా సోమవారం కరోనా పరీక్షలు చేశారు. ఈ కారణంగా ఈనెల 14వ తేదీన జరగాల్సిన మంత్రుల పదవీ ప్రమాణం కార్యక్రమం వాయిదాపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అయితే కరోనా కష్టకాలంలో పనిచేయాల్సి ఉన్నందున సీఎం ఆశీస్సులతో ఆదేరోజున ఉప ముఖ్యమంత్రి సహా నలుగురు మంత్రులు పదవీ ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. అలాగే, అరియలూరు జిల్లాకు చెందిన రాష్ట్రమంత్రి శివశంకర్‌కు కరోనా సోకడంతో హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు.  
చదవండి: 
రంగస్వామి రికార్డు.. పుదుచ్చేరి సీఎంగా నాలుగో సారి
కేంద్రం చేసింది క్రూరమైన నేరం: సిసోడియా

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top