నేడే పీఎస్‌ఎల్‌వీ సీ–56 ప్రయోగం | Sakshi
Sakshi News home page

నేడే పీఎస్‌ఎల్‌వీ సీ–56 ప్రయోగం

Published Sun, Jul 30 2023 5:56 AM

PSLV-C56 mission: ISRO to launch Singapore earth observation satellite on 30 july 2023 - Sakshi

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): పీఎస్‌ఎల్‌వీ సీ–56 ఉపగ్రహ వాహకనౌకకు శనివారం ఉదయం 5.01 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ మొదలైంది. భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో), న్యూస్పేస్‌ ఇండియా తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఉదయం 6.31 గంటలకు దీనిని ప్రయోగించనున్నారు. 25.30 గంటలపాటు కౌంట్‌డౌన్‌ సాగుతుంది.

శుక్రవారం సాయంత్రం ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ షార్‌కు చేరుకున్నారు. శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించి కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాకెట్‌కు నాలుగో దశలో 0.8 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. శనివారం రాత్రికి రాకెట్‌కు రెండో దశలో 41 టన్నుల ద్రవ ఇం«ధనాన్ని నింõపుతారు. ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన 7 ఉపగ్రహాలను నియో ఆర్బిట్‌లోకి ప్రవేశ పెట్టనున్నారు.

Advertisement
Advertisement