పలు రాష్ట్రాల గవర్నర్ల మార్పు

President  Ramnath Kovind appoints new governors - Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాల గవర్నర్లను మార్చడంతో పాటు ఉత్తరాఖండ్‌కు రాష్ట్రపతి కొత్త గవర్నర్‌ను నియమించారు. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఉన్న బన్వరిలాల్‌ పురోహిత్‌ను పంజాబ్‌ గవర్నర్‌గా నియమించారు. ఇప్పటివరకు ఆయన పంజాబ్‌ గవర్నర్‌ బాధ్యతలు అదనంగా పర్యవేక్షిస్తున్నారు. నాగాలాండ్‌ గవర్నర్‌గా ఉన్న మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎన్‌ రవిని తమిళనాడు గవర్నర్‌గా నియమించారు. అసోం గవర్నర్‌ జగదీశ్‌ ముఖికి నాగాలాండ్‌ బాధ్యతలు అదనంగా అప్పగించారు. ఇటీవలే ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా ఉన్న మౌర్య రాజీనామా చేయడంతో ఆ స్థానంలో రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ గురి్మత్‌ సింగ్‌ను నియమించారు. 2016లో సింగ్‌ ఆర్మీ నుంచి రిటైరయ్యారు. చైనాతో మిలటరీ వ్యవహారాల్లో ఆయన అనుభవజ్ఞుడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top