కొత్త ఏడాదికి ముందే మరిన్ని మద్యం దుకాణాలు | Premium Liquor Shops will Open in Delhi Before the New Year | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాదికి ముందే మరిన్ని మద్యం దుకాణాలు

Nov 6 2024 10:15 AM | Updated on Nov 6 2024 10:15 AM

Premium Liquor Shops will Open in Delhi Before the New Year

న్యూఢిల్లీ: రాబోయే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సరానికి ముందే ప్రీమియం మద్యం షాపులను తెరవాలని యోచిస్తోంది. ఈ  విషయాన్ని ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం నూతనంగా ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాలు  500 చదరపు మీటర్ల కంటే అధిక విస్తీర్ణంలో ఉండనున్నాయి. వినియోగదారులు దుకాణంలోని షెల్ఫ్ నుండి తమకు ఇష్టమైన బ్రాండ్‌ను ఎంచుకునే  అవకాశం ఏర్పడనుంది. ఈ నూతన ప్రీమియం స్టోర్లు.. మాల్స్ షాపింగ్ కాంప్లెక్స్‌లలో  ఏర్పాటుకానున్నాయి. ఢిల్లీలోని నాలుగు కార్పొరేషన్లు ఈ దుకాణాలను ఏర్పాటు చేయనున్నాయి.

నూతనంగా ఈ ప్రీమియం దుకాణాలను తెరవడం వల్ల ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలపై సుంకం ద్వారా రూ.3,047 కోట్లు ఆర్జించగా, గత ఏడాది ఇదే కాలంలో రూ.2,849 కోట్లు ఆర్జించింది.

ఇది కూడా చదవండి: అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై లిచ్ట్‌మన్ జోస్యం వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement