లవర్‌ కోసం వెయిటింగ్‌.. లిఫ్ట్‌ పేరుతో కానిస్టేబుల్‌ ఏం చేశాడంటే..?

Police Constable Harassing Minor At Karnataka - Sakshi

బనశంకరి: ఓ పోలీసు సభ్య సమాజం తలదించుకునేలా చేశాడు. ఆపదలో ఉన్నవారికి అండగా ఉండాల్సిన పోలీస్‌.. కామంతో చిన్నారిని కాటేశాడు. బైక్‌పై డ్రాప్‌ ఇస్తానని చెప్పి మైనర్‌(17)ను ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. గోవిందరాజనగర పీఎస్‌లో  కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న  పవన్‌(24) దారుణానికి ఒడిగట్టాడు. చామరాజనగర ప్రాంతానికి చెందిన అమ్మాయి.. ఓ యువకునితో ప్రేమలో పడి, ఇంటిని వదిలిపెట్టి అతడి కోసం వెళ్లింది. ఈ క్రమంలో బెంగళూరుకు చేరుకుని 27వ తేదీన ఒక పార్కు వద్ద కూర్చుంది. కాగా, అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ పవన్‌.. ఆమెను ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించగా చామరాజనగరకు వెళ్లా­ల­ని చెప్పింది. సరేనంటూ బాధితురాలిని తాను.. తీసుకువెళ్తానని నమ్మించి తన అద్దె ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్ప­డ్డాడు. తరువాత చామరాజనగరకు బస్‌­లో ఎక్కించి పంపించాడు.

అనంతరం ఇంటికి వెళ్లిన బాధితురాలు.. తన కుటుంబసభ్యులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో బాధితులు బెంగళూరుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పవన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని నగర పోలీస్‌ కమిషనర్‌  సీహెచ్‌ ప్ర­తాప్‌రెడ్డి తెలిపారు. నిందితున్ని అ­రెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: ర్యాగింగ్‌ పేరుతో అర్ధరాత్రి హాస్టల్‌ రూమ్‌లో సీనియర్ల అరాచకం.. ఇలా కూడా చేస్తారా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top