‘జనశక్తి’ ఎగ్జిబిషన్‌లో మోదీ | PM Narendra Modi visits Jana Shakti Art Exhibition at National Gallery | Sakshi
Sakshi News home page

‘జనశక్తి’ ఎగ్జిబిషన్‌లో మోదీ

May 15 2023 6:19 AM | Updated on May 15 2023 6:19 AM

PM Narendra Modi visits Jana Shakti Art Exhibition at National Gallery  - Sakshi

న్యూఢిల్లీ: మన్‌కీ బాత్‌ 100వ ఎపిసోడ్‌ పూర్తయిన సందర్భంగా నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడర్న్‌ ఆర్ట్‌(ఎన్‌జీఎంఏ)లో ఏర్పాటైన ఎగ్జిబిషన్‌ను ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు. ‘జన శక్తి: ఒక సమ్మిళిత శక్తి’ఇతి వృత్తంతో ఏర్పాటైన ఈ ఎగ్జిబిషన్‌లో ప్రముఖులైన 13 మంది కళాకారుల కళా ఖండాలున్నాయి.

ఎగ్జిబిషన్‌లో ఆయన కలియదిరిగారని సాంస్కృతిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మన్‌కీ బాత్‌లో తమకు ప్రేరణనిచ్చిన అంశాల గురించి కళాకారులు ప్రధానికి వివరించారని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement