వైద్యులకు సెల్యూట్: ప్రధాని మోదీ

PM Narendra Modi Speech On Occasion Of Doctors Day - Sakshi

కరోనాపై పోరులో డాక్టర్లు ముందున్నారు

డాక్టర్స్‌ డే సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగం

సాక్షి, ఢిల్లీ: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వారి సేవలను గుర్తుచేసుకుంటూ.. కరోనా కాలంలో సేవలందించిన వైద్యులకు ప్రధాని నరేంద్రమోదీ సెల్యూట్ చేశారు. గురువారం.. ప్రధాని ప్రసంగిస్తూ కరోనాతో చాలా మంది డాక్టర్లు చనిపోయారని.. వైద్యుల భద్రతకు కఠిన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

కరోనాపై పోరులో డాక్టర్లు ముందున్నారన్నారు. వైద్య రంగానికి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తున్నామని మోదీ అన్నారు. వైద్యుల దినోత్సవం సంద‌ర్భంగా వైద్యులంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలుపుతూ.. ప్ర‌ధాని ట్వీట్ చేశారు. వైద్య రంగంలో భార‌త్‌ పురోగ‌మించ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top