సైప్రస్‌ అధ్యక్షుడికి మోదీ బహుమతులు | PM Modi Gifts Handmade Kashmiri Silk Carpet To Cyprus President | Sakshi
Sakshi News home page

సైప్రస్‌ అధ్యక్షుడికి మోదీ బహుమతులు

Jun 17 2025 8:40 AM | Updated on Jun 17 2025 9:57 AM

PM Modi Gifts Handmade Kashmiri Silk Carpet To Cyprus President

న్యూఢిల్లీ: సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడౌలిడెస్‌కు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పలు బహమతులు అందజేశారు. చేతితో తయారు చేసిన కాశ్మీరీ సిల్క్‌ కార్పెట్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌ కళాకారులు రూపొందించిన వెండి పర్సును బహూకరించారు. ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి నేతలకు భారతీయ సంప్రదాయాలు, సంస్కృతిని చాటిచెప్పే బహమతులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

సైప్రస్‌ అధ్యక్షుడికి ఇచ్చిన కాశ్మీరీ సిల్క్‌ కార్పెట్‌కు ఎన్నో విశిష్టతలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. కాశ్మీర్‌ లోయలోని కళాకారులు శతాబ్దాల నాటి కుట్టు నైపుణ్యాలను ఉపయోగించి, దీన్ని తయారు చేశారని చెప్పారు. అసలు సిసలైన మల్బరీ పట్టు, సహజసిద్ధమైన రంగులు వాడినట్లు పేర్కొన్నారు.

ఇక వెండి క్లచ్‌ పర్సు కూడా విలువైందేనని అన్నారు. సంప్రదాయ లోహపు పనితనం, ఆధునిక రీతులను మేళవించి దీన్ని రూపొందించినట్లు వెల్లడించారు. పర్సుపై ఉన్న పూల డిజైన్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ కళాకారుల నైపుణ్యానికి ఇదొక నిదర్శనమని స్పష్టంచేశారు.    

Advertisement
 
Advertisement
Advertisement