పెరియార్ ఆనైముత్తు కన్నుమూత

సాక్షి, చెన్నై: ద్రవిడ సిద్ధాంతాలను అనుసరిస్తూ, మార్కిస్టు, పెరియారిస్టు కమ్యూనిస్టు పార్టీ నేతగా తమిళులకు సుపరిచితుడైన వి.ఆనైముత్తు(96) మంగళవారం రాత్రి కన్నుమూశారు. పెరియార్ అడుగుజాడల్లో నడుస్తూ రచనలు, కవితలతో ముందుకు సాగిన ఆనైముత్తు వెనుకుబడిన సామాజిక వర్గం అభ్యున్నతి, రిజర్వేషన్ల కోసం ఉద్యమాల్ని గతంలో సాగించారు.
పుదుచ్చేరిలో ఓ పత్రికను నడుపుతూ వచ్చిన ఆనైముత్తు అనారోగ్యం, వయోభారంతో బాధపడుతూ వచ్చారు. పుదుచ్చేరిలో ఉన్న ఆయనకు అనారోగ్యసమస్యలు జఠిలమయ్యాయి. దీంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా తుదిశ్వాస విడిచారు. బుధవారం ఆయన భౌతిక కాయానికి పలువురు నేతలు నివాళులర్పించారు.
చదవండి: ఫేస్‌బుక్‌లో ఓటింగ్ వీడియో ఆప్‌లోడ్ చేయడంతో..
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి