లైసెన్స్‌ ఇచ్చి నల్లమందు సాగు చేయిస్తుంటే..చిలుకలు దొంగలిస్తున్నాయ్‌!

Parrots Fly away With Large Quantity Of Opium In Madhya Pradesh - Sakshi

ప్రతి ఏడాది అక్కడ పెద్ద మొత్తంలో నల్లమందును సాగు చేస్తారు. అయితే రైతుల ఉత్పత్తిని అంతా చిలుకలు దొంగలించేస్తున్నాయ్‌. దీంతో రైతులు దీనికి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించడం ప్రారంభించారు. ప్రతి ఏడాది చిలుకలు పెద్ద మొత్తంలో ఈ నల్లమందును ఎత్తుకుపోతున్నట్లు తెలిపారు రైతులు. వాస్తవానికి మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌, నీముచ్‌, రత్లాం జిల్లాలో నల్లమందు సాగు చేస్తారు. అందుకు నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో సాగుకు లైసెన్సులు ఇస్తుంది. ఈ పంటను పర్యవేక్షించే బాధ్యతలన్నింటిని బ్యూరో తీసుకుంటుంది.

నల్లమందు పంటను జనవరి, మార్చి మధ్యలో సాగు చేస్తారు. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే కూరగాయాల మార్కెట్లలో కూడా విక్రయిస్తుంటారు. ఎందుకంటే కొంతమంది ప్రజలు వాటి విత్తనాలను ఆహారంలో భాగంగా తీసుకుంటారు. అంతేగాదు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా రైతుల నుంచి నల్లమందును కొనుగోలు చేస్తుంది. ఈ నల్లమందును ఉపయోగించి కొన్ని గుండె, రక్తం, నిద్రకు సంబంధించిన మందుల తయారీలో వినయోగిస్తారు.

ఇటీవల ఈ చిలుకల దాడి కారణంగా నల్లమందు సాగులో రైతులు ఎక‍్కువుగా నష్టపోతున్నారు. ఈ విషయంలో పోలీసుల సైతం ఏం చేయలేమని చెప్పడంతో ప్లాస్టిక్‌ వలలను అమర్చడం ప్రారంభించారు. దీంతో ఆ చిలకలు కూడా నల్లమందు కాయలను అందించుకోవడం సాధ్యం కాక నిలబడి ఉన్న పంటకు నష్టం చేయడం ప్రారంభించాయి. 

(చదవండి: ఆఫీసులో లాడెన్‌ పోస్టర్లు కలకలం..దెబ్బకు అధికారిని..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top