ఆఫీసులో లాడెన్‌ పోస్టర్లు కలకలం..దెబ్బకు అధికారిని..

UP Man Put Up His Idol Osama Bin Ladens Poster In Office - Sakshi

ఉత్తర ప్రదేశ్‌లోని ఒక వ్యక్తి తన కార్యాలయంలో ఉగ్రవాది ఒసామా డిన్‌ లాడెన్‌ పోస్టర్లు ఉంచిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో అధికారులు ఆ వ్యక్తిని విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకెళ్తే..ఉత్తరప్రదేశ్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(యూపీపీసీఎల్‌) రవీంద్ర ప్రకాష్‌ గౌతమ్‌ అనే సబ్‌ డివిజనల్‌ అధికారి తన కార్యాలయంలో ఒసామాబిన్‌ లాడెన్‌ పోస్టర్లను ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి.

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో యూపీపీసీఎల్‌ చైర్మన్‌ ఎం దేవరాజ్‌ సీరియస్‌ అవ్వడమే గాక సదరు అధికారి గౌతమ్‌ని విధుల నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఆయన 2022 జూన్‌లో ఫరుఖాబాద్‌ జిల్లాలోని కయామ్‌ గంజ్‌ సబ్‌డివిజన్‌ 2కి పోస్టింగ్‌ పై వచ్చాడు. అప్పుడే ఈ పోస్టర్లు ఉంచినట్లు సమాచారం.

ఐతే విచారణలో.. గౌతమ్‌ లాడెన్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసినందువల్లే అతన్ని ఆరాధ్య దైవంగా పూజించేవాడని సహోద్యోగులు చెబుతున్నారు. అతనిపై అభిమానంతో లాడెన్‌ ఫోటోలు కార్యాలయంలో ఉంచేవాడని చెప్పారు. దీంతో అతన్ని సర్వస్‌ నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. 

(చదవండి: పూరి జగన్నాథుడి గుడిలో ఎలుకల బెడద.. అవి పెడితే దేవుడి నిద్రకు..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top