‘పార్లమెంట్‌ ఘటనకు మోదీ విధానాలే కారణం’ | Parliament Security Breach: Rahul Gandhi Slams On Policies For Unemployment And Inflation | Sakshi
Sakshi News home page

‘పార్లమెంట్‌ భద్రతా వైఫల్యం: నిరుద్యోగం, ద్రవ్యోల్బణమే కారణం’

Dec 16 2023 3:28 PM | Updated on Dec 16 2023 4:09 PM

Parliament Security Breach: Rahul Gandhi Slams On Policies For Unemployment And Inflation - Sakshi

నిరుద్యోగం, ద్రవ్యోల్బణమే పార్లమెంట్‌ భద్రతా వైఫల్యం వెనకాల ‍ప్రధాన కారణాలుగా ఉన్నాయని రాహుల్‌గాంధీ ఆరోపించారు.

న్యూఢిల్లీ:  దేశంలోని పెరిగిపోయిన యువత నిరుద్యోగానికి కారణం నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం మొదటి సారీ పార్లమెంట్‌ భద్రత వైఫల్యంపై మీడియాతో మాట్లాడారు.

పార్లమెంట్‌ భద్రత వైఫల్యం వంటి ఘటనలు జరగడానికి కారణం యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడమని అన్నారు. దేశంలో నిరుద్యోగమనే అతిపెద్ద సమస్యను ఎదుర్కొవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. మోదీ పాలసీలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయని దుయ్యబట్టారు.

పార్లమెంట్‌ భద్రతా వైఫల్యం జరిగింది నిజమేనని.. అయితే లోక్‌ సభలో ఈ ఘటన ఎందుకు చోటు చేసుకుంది? ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం అతి పెద్ద సమస్యగా మారిందని అన్నారు. కేవలం యువత నిరుద్యోగం ప్రధాని మోదీ అవలంభిస్తున్న విధానాల వల్లనే పెరిగిందని ధ్వజమెత్తారు. దీంతో దేశంలోని యువత ఉద్యోగాలను పొందలేకపోతున్నారని అన్నారు.

మోదీ విధానాల వల్ల దేశంలో పెరుగుతున్న.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణమే పార్లమెంట్‌ భద్రతా వైఫల్యం వెనకాల ‍ప్రధాన కారణాలుగా ఉన్నాయని రాహుల్‌గాంధీ ఆరోపించారు. పార్లమెంట్‌ ఘటనకు సంబంధించిన అరెస్టు అయిన నిందితుల్లో ముగ్గురూ నిరుద్యోగ బాధితులు ఉన్నారు. నిందితులు ఉద్యోగాలు రాక చాలా నిరుత్సాహంతో ఉన్నట్లు వారి కుటుంబ సభ్యులు కూడా తెలియజేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement