పాక్‌ పన్నాగం​: బయటపడ్డ రహస్య సొరంగం 

Pak secret tunnel to push terrorists for 8 years in Jammu detected by BSF - Sakshi

ఉగ్రవాదులరహస్య సొరంగాన్ని కనుగొన్న బీఎస్ఎఫ్ అధికారులు 

8 సంవత్సరాల క్రితం దీన్నినిర్మించినట్టు అంచనా

సాక్షి, న్యూఢిల్లీ : పొరుగుదేశం పాకిస్తాన్‌ కుయుక్తి మరోసారి బయటపడింది. కతువా జిల్లాలోని పన్సార్ వద్ద ఒక సీక్రెట్‌ సొరంగాన్ని బీఎస్‌ఎఫ్‌ దళాలు గుర్తించాయి. బీఎస్‌ఎప్‌ ఔట్‌పోస్ట్‌ సమీపంలో బోర్డర్ పోస్ట్‌ వద్ద 30 అడుగుల లోతైన రహస్య టన్నెల్‌ను గుర్తించామని బీఎస్‌ఎఫ్‌ అధికారులు శనివారం ప్రకటించారు. పాకిస్తాన్ మిలిటరీ, దాని ఉగ్రవాదుల సొరంగాలను గుర్తించడం చాలా ముఖ్యమనీ అక్రమ చొరబాట్లకు  ఉగ్రవాదులు ఈ సొరంగాలను ఉపయోగిస్తారని, తీవ్రవాద నిరోధక అధికారి ఢిల్లీలో చెప్పారు. గత పదిరోజుల్లో  రెండు భారీ సొరంగాలను  బీఎస్‌ఎఫ్‌ గుర్తించిన కావడం గమనార్హం.

భారత్‌లోకి ఉగ్రవాదులను పంపేందుకు జమ్ము కశ్మీర్‌లో పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ఉపయోగించిన 150 మీటర్ల పొడవైన భారీ రహస్య సొరంగాన్ని వినియోగించిందని  బీఎస్‌ఎఫ్‌ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.  గత ఏడాదిగా బీఎస్‌ఎఫ్‌ పలు సొరంగాలను పసిగట్టి ధ్వంసం చేస్తూ, పాక్‌ కుయుక్తులను నిర్వీర్యం చేస్తున్నామన్నారు. దీని ద్వారా గత ఎనిమిదేళ్ల నుంచి భారత్‌లోకి పాకిస్తాన్‌ ఉగ్రవాదులను దేశంలోకి పంపిస్తోందని అధికారులు చెప్పారు. నియంత్రణ రేఖను దాటడం చాలా కష్టమైనప్పుడు, పాక్‌ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు ఎంచుకుంటారని తెలిపారు.2012 నుంచి పాకిస్తాన్‌ భారత శిబిరాలపై కాల్పులకు తెగ బడుతోందని, ఈ ప్రాంతానికి సమీపంలోనే కొత్త బంకర్‌ను గుర్తించినట్టు  బీఎస్‌ఎఫ్ వర్గాలు పేర్కొన్నాయి. 

మరోవైపు  పూంచ్ జిల్లాలో ఇంటెలిజెన్స్ సమాచారంపై బీఎస్‌ఎఫ్‌ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఉగ్రవాద దాక్కున్న స్థావరంతోపాటు కొన్ని ఆయుధాలు, మందుగుండు సామగ్రిని గుర్తించింది. ముఖ్యంగా ఏ​కే-47 రైఫిల్, మూడు చైనా తయారు చేసిన పిస్టల్స్, అండర్ బారెల్ గ్రెనేడ్ లాండర్‌తో ఒక రేడియో సెట్‌ను స్వాధీనం చేసుకుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top