అమానుషం.. వైద్యం పేరుతో 9 నెలల చిన్నారికి వాతలు.. అల్లాడిన పసి ప్రాణం | Orissa: 9 Months Baby Red Hot Iron Branding Blind Belief Koraput | Sakshi
Sakshi News home page

అమానుషం.. వైద్యం పేరుతో 9 నెలల చిన్నారికి వాతలు.. అల్లాడిన పసి ప్రాణం

Jul 31 2022 12:57 PM | Updated on Jul 31 2022 2:38 PM

Orissa: 9 Months Baby Red Hot Iron Branding Blind Belief Koraput - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కొరాపుట్‌: మూఢ నమ్మకం ముక్కు పచ్చలారని పసికందు ప్రాణం తీసింది. నవరంగ్‌పూర్‌ జిల్లా రాయిఘర్‌ సమితి జోడాబర–2 గ్రామంలో ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుఖదేవ్‌ గొండో కుమారుడు రూపేష్‌ గొండో(9 నెలలు) తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గుతో బాధ పడుతున్నాడు. దీంతో కుటుంబీకులు మంత్రగాడుని సంప్రదించగా, శిశువు పొట్ట, గుండెపై కొడవలితో వాతలు పెట్టించారు. నొప్పి తట్టుకోలేక ఆ పసి ప్రాణం అల్లాడిపోయింది.

విషయం తెలుసుకున్న ఆశా కార్యకర్త సుభావతి గొండో అంబులైన్స్‌కు సమాచారం అందిదంచి, రూపేష్‌ను బొడబరండి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి్పంచారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు చికిత్స అందించగా, ఆస్పత్రిలో ఎవరికీ తెలియకుండా కుటుంబీకులు శిశువుని తిరిగి ఇంటికి తెచ్చారు. మరోసారి మంత్రగాడితో పూజలు చేయించగా, రూపేస్‌ మృతిచెందాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.

చదవండి: సీఎం పదవి ఖాళీగా లేదు! ఒకరిద్దరూ గొంతు చించుకుంటే సీఎం కాలేరు!

Advertisement
 
Advertisement
Advertisement