నాలుగు రోజుల్లో సీఎం యోగీకి మరణం తప్పదని బెదిరింపు కాల్‌

‘Only 4 Days Left, CM Yogi Adityanath Gets Death Threat - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బెదిరింపు కాల్స్‌ ఎక్కువయ్యాయి. తాజాగా యూపీ పోలీసులకు చెందిన ‘112’ అనే వాట్సాప్‌ నెంబర్‌కు సీఎంను చంపేస్తామని మరోసారి బెదిరింపు సందేశాలు అందినట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 29న గుర్తు తెలియని వ్యక్తి ఓ మెసెజ్‌ ద్వారా ‘యూపీ సీఎం ఆదిత్యానాథ్‌కు ఇంకా నాలుగు రోజులే మిగిలున్నాయి. ఆయనకు మరణం తప్పదు’ అని హెచ్చరించినట్లు సమాచారం. కాగా ఈ విషయంపై ఇప్పటికే సుశాంత్‌ గోల్ఫ్‌ సిటీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేగాక  హెచ్చరికలు పంపినవారేవరో తెలుసుకుని అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ఓ నిఘా బృందాన్ని ఏర్పాటు చేశారు.

అయితే యూపీ సీఎంకు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో కూడా హోమంత్రి అమిత్‌షాతో పాటు యోగి ఆదిత్యనాథ్‌ను కూడా చంపేస్తామని బెదిరిస్తూ కేంద్ర రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌కు ఈ మెయిల్‌ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే గత ఏడాది సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్‌లలో యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామని బెదిరిస్తూ కాల్స్ అందాయి.

చదవండి: 
పీటల మీద పెళ్లి ఆపిన వధువు.. కారణం తెలిస్తే షాకే!
జనాలతో కప్ప గంతులు వేయించిన పోలీసులు.. ఎందుకంటే!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top