పెళ్లి కోసం వరుడు పాట్లు..రాత్రంత కాలినడకన వెళ్లి మరీ తాళి కట్టాడు!

Odisha Groom Walks All Night To Reach Brides Home Over Drivers Strike - Sakshi

డ్రైవర్ల​ సమ్మె కారణంగా వరడు నానాపాట్లు పడ్డాడు. పెళ్లి కోసం అని వధువు ఇంటికి వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం కానరాక నానా తిప్పలు పడ్డాడు. చివరికి వరుడు కుటుంబం కాలినిడకన వధువు ఇంటికి చేరుకుని మరీ ఆ వధవరులకు వివాహం జరిపించారు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఒడిశాలోని కల్యాణ్‌ సింగ్‌పూర్‌ బ్లాక్‌ పరిధిలోని సునఖండి పంచాయతీలో నివసిస్తున్న వరుడు 28 కి.మీ దూరంలో ఉన్న దిబలపాడు గ్రామానికి రాత్రంతా నడిచి మరి వధువు ఇంటికి చేరుకుని పెళ్లి చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఐతే శుక్రవారం ఆ జంటకి వివాహం ఘనంగా జరిగింది. ఇదిలా ఉండగా, ఒడిశాలో డ్రైవర్లు భీమా, ఫించన్‌, సంక్షేమ బోర్డు ఏర్పాటు తదితరాలను కావాలని డిమాండ్‌ చేస్తూ డ్రైవర్‌ ఏక్తా మహాసంఘ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మే చేపట్టింది. 90 రోజులుగా జరుగుతున్న నిరవధిక సమ్మెని తమ డిమాండ్లన్నీ నెరవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నిలిపేశారు. రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పి కె జెనా, డీజేపీ ఎస్ కే బన్సక్ సమ్మెను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేసిన కొద్ది గంటలే డ్రైవర్ల ఏక్తా మహాసంఘ్‌ సమ్మెను నిలిపేస్తున్నట్లు ‍ప్రకటించింది. దాదాపు రెండు లక్షల మంది డ్రైవర్ల సమ్మె కారణంగా కార్యాలయాలకు వెళ్లేవారు, పర్యాటకులు, సామాన్యులు ఎంతగానే ఇబ్బందిపడ్డారు. ఈ సమ్మె కారణంగా ధరలు కూడా ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి కూడా. 

(చదవండి: మద్యం మత్తులో కళ్యాణ మండపానికి వెళ్లడం మర్చిపోయిన వరుడు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top