తండ్రి మృతదేహాన్ని బైక్‌పై తరలించిన కుమారులు

No Ambulance Son Carries Father Dead Body On Bike In Odisha - Sakshi

పర్లాకిమిడి: ఖొజురిపద ప్రభుత్వ ఆస్పత్రిలో 65 ఏళ్ల వృద్ధుడు శుక్రవారం చనిపోయాడు. అయితే ఈ వ్యక్తి మృతదేహం తరలించేందుకు ఆ ఆస్పత్రిలో అంబులెన్స్‌ సౌకర్యం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మృతుడి కొడుకులిద్దరూ మోటార్‌బైక్‌పై తమ గ్రామానికి తమ తండ్రి మృతదేహం తీసుకువెళ్లి, అంత్యక్రియలు జరిపారు. ఈ ఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తం కాగా అన్ని ఆస్పత్రులకు మహా ప్రయాణం వాహనం ఇచ్చామని అయితే ఇక్కడ అటువంటి వాహనం లేకపోవడం విచారకరమని జిల్లా ముఖ్య వైద్యాధికారి ప్రదీప్‌కుమార్‌ పాత్రో తెలిపారు. తమ తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే ఆస్పత్రి వర్గాలు చోద్యం చూశాయని బాధిత యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల బాగుకోసం, ఆరోగ్య సంరక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని డబ్బా కొట్టుకునే నాయకులు, ఇప్పటికైనా కళ్లు తెరిచి పాలన సాగించాలని హితవు పలికారు.
(చదవండి: పంటపొలాల్లో శవమై కనిపించిన బాలిక)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top