నవీ ముంబైలో శ్రీవారి ఆలయానికి భూమి పూజా.. పాల్గొన్న సీఎం షిండే

Navi Mumbai: CM Shinde, Dy CM Fadnavis Participate TTD Temple Bhoomi Puja - Sakshi

ముంబై:  నవీ ముంబైలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆలయానికి అర్చకులు భూమి పూజా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే, రేమాండ్స్ అధినేత సింఘానియా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సీఎం ఏక్‌నాథ్‌ షిండే మాట్లాడుతూ.. తిరుమల తరహలో నవీ ముంబాయిలో శ్రీవారి ఆలయాని నిర్మించడానికి టీటీడీ ముందుకు రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఆలయ నిర్మాణంతో నవీ ముంబాయి ఆర్థికంగా ముందుకు వెళ్తుందని భావిస్తున్నామన్నారు. ఆలయానికి సమీపంలోని తీర ప్రాంతం నుంచి నిర్మింస్తున్న అతి పెద్ద బ్రిడ్జితో కోల్హాపూర్ లక్ష్మి అమ్మవారి ఆలయానికి అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు.తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకోలేని భక్తులకు.. నవీ ముంబైలో నిర్మిస్తున్న ఆలయంలో స్వామివారిని దర్శించుకునే అదృష్టం లభిస్తుందన్నారు.

శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఏకరాల స్థలం కేటాయించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయ తరహలోనే నవీ ముంబైలో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రెండేళ్లలో ఆలయ నిర్మాణంపూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పిస్తామని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top