ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారు? | National ST Commission condemns attacks on STs | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారు?

Jul 5 2025 5:50 AM | Updated on Jul 5 2025 9:21 AM

National ST Commission condemns attacks on STs

ఎస్టీల మీద దాడులపై జాతీయ ఎస్టీ కమిషన్‌ మండిపాటు.. 

ఈనెల 8న విచారణకు హాజరుకావాలని కలెక్టర్, ఎస్పీలకు సమన్లు 

ఎంపీ తనూజ రాణి ఫిర్యాదుపై కమిషన్‌ స్పందన  

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో ఎస్టీలపై జరుగుతున్న దాడులపట్ల జాతీయ ఎస్టీ కమిషన్‌ తీవ్ర ఆగ్ర­హం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వరుస దాడులు జరుగుతుంటే పోలీసు యంత్రాంగం, ప్రభు­­త్వం ఏం చేస్తున్నాయంటూ ప్రశ్నించింది. ప్రభుత్య వ్యవహారశైలి, పోలీసుల తీరు­పై అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం, ఎంపేడు­లో ఎస్టీల మీద జరిగిన దాడులపై వైఎస్సార్‌సీపీ అరకు ఎంపీ డాక్టర్‌ గుమ్మా తనూజరాణి ఢిల్లీ­లోని జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. 

అమాయకులపై దాడులు జరిగినా ప్రభు­త్వం, పోలీసులు పట్టించుకోవడంలేదని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధిం­­చిన ఆధారాలను ఆమె కమిషన్‌కు అందచేశారు. దీనిపై కమిషన్‌ స్పందిస్తూ సంబంధి­త కలె­క్టర్, ఎస్పీలకు సమన్లు జారీచేసింది. తాము ఈనెల 8న విచారణ నిర్వహించనున్నామని, ఆ విచారణకు హాజరుకావాలని, లేనిపక్షంలో చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement