నేషనల్ సినిమా డే నాడు బంపరాఫర్.. మల్టీఫ్లెక్సుల్లో రూ.75కే టికెట్

ముంబై: ఓటీటీల కాలంలో.. కరోనా తర్వాత సాధారణ థియేటర్లతో పోలిస్తే మల్టీఫ్లెక్స్‌లకే ప్రేక్షకుల తాకిడి పెరుగుతోంది. ఈ క్రమంలో.. తాజాగా మల్టీ ఫ్లెక్స్ అసోసియేషన్ ఆసక్తికర నిర్ణయం ఒకటి తీసుకుంది. వంద రూపాయలలోపు టికెట్ రేటుతో ప్రేక్షకుడికి సినిమా అనుభూతిని అందించాలని నిర్ణయించుకుంది. అయితే ఇక్కడో విషయం ఉందండోయ్.
సెప్టెంబర్ 16న నేషనల్ సినిమా డే. ఈ సందర్భంగా.. ప్రేక్షకులకి ఈ బంపరాఫర్ ప్రకటించింది మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(MAI). కరోనా లాక్‌డౌన్ తర్వాత ఆదరిస్తున్న ప్రేక్షకుల గౌరవార్థం ఆ ఒక్కరోజు ఈ పని చేస్తున్నట్లు ప్రకటించింది ఎంఏఐ. పీవీఆర్, ఐనాక్స్, సినీపోలీస్, కార్నివాల్, మిరాజ్, ఏషియన్.. ఇలా పలు మల్టీఫ్లెక్స్ ఫ్రాంచైజీల్లో ఆరోజున కేవలం రూ.75కే సినిమా చూడొచ్చు.
ఇందుకోసం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 4000 స్క్రీన్స్‌లో సినిమా చూడొచ్చని మల్టీఫ్లెక్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ డిస్కౌంట్ ద్వారా అయిన ఆడియొన్స్‌ను ఆ ఒక్కరోజు రప్పించ వచ్చనే ఆలోచనలో ఉంది. అయితే ఇప్పటికే బాయ్‌కాట్‌ట్రెండ్ మోజులో ఉన్న ఆడియెన్స్.. ఈ బంపరాఫర్‌ను స్వీకరిస్తారా? తిరస్కరిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. అయితే.. మల్టీఫ్లెక్స్ ఫ్రాంచైజీలు మాత్రం ఫ్యామిలీ ఆడియొన్స్ రావొచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Cinemas come together to celebrate ‘National Cinema Day’ on 16th Sep, to offer movies for just Rs.75. #NationalCinemaDay2022 #16thSep
— Multiplex Association Of India (@MAofIndia) September 2, 2022
ఇదీ చదవండి: బీజేపీలో ఉంటూనే ‘ఆప్’ కోసం పని చేయండి