సినిమా థియేటర్లకు ఆదరణ లేక.. | People Not interested cinema theatre | Sakshi
Sakshi News home page

సినిమా థియేటర్లకు ఆదరణ లేక..

Jun 18 2025 10:07 AM | Updated on Jun 18 2025 11:28 AM

People Not interested cinema theatre

నెలరోజుల్లో రెండు థియేటర్లు మూత 

ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్న సినిమాలు 

ఓటీటీ రాకతో థియేటర్‌కు వచ్చేందుకు ప్రేక్షకుల విముఖత

మాచర్ల రూరల్‌: ఒకప్పుడు సినిమా విడుదల అంటే పల్లె, పట్టణం లేడా లేదు.. ఊరుంతా పండుగ వాతావరణం. టికెట్‌ దొరకతే ఆ ఆనందం లెక్క వేరు. అర్ధరాత్రి నుంచి అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరేవారు. అప్పట్లో ఏడాది కాలంగా ఒకే థియేటర్‌లో సినిమా ప్రదర్శించిన రోజులున్నాయి. ప్రస్తుతం రోజులు మారాయి. వినోద రంగం కొత్త పుంతలు తోక్కుతోంది. ఓటీటీలు రాకతో థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 

పట్టణంలో ఇలా..  
మాచర్ల పట్టణంలో నీలిమా డీలక్స్, శ్రీ రామాటాకీస్, శ్రీనివాస మహాల్, నాగార్జున కళామందిర్, శ్రీ వెంకటేశ్వర థియేటర్‌లు ఉండేవి. చంద్రవంక నూతన బ్రిడ్జి నిర్మాణంతో నీలిమా డీలక్స్‌ «సినిమా హాలు వాగు నీటి ప్రవాహంతో థియేటర్‌కు రాకపోకలకు ఇబ్బంది కలుగుతుండటంతో 20 ఏళ్ల క్రితం ఆ థియేటర్‌ను పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం నాలుగు థియేటర్లు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో శ్రీ రామాటాకీస్, నాగార్జున కళామందిర్‌ ప్రేక్షకులు రాకపోవటంతో సినిమాలు రిలీజ్‌లు లేకపోవటంతో నెల రోజుల నుంచి ఆ రెండు థియేటర్లు మూసివేశారు. 

మల్టీప్లెక్స్ లు రాకతోనూ... 
మలీ్టఫ్లెక్స్‌ వచ్చిన తరువాత సింగిల్‌ స్క్రీన్‌కు వెళ్లేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపటం లేదు. కరోనా వచ్చిన తరువాత సినిమా థియేటర్లు నిర్వహణ సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. అద్దె ప్రాతిపదికన నిర్వహించటం, డిస్ట్రిబ్యూటర్లుకు, ఎగ్జిబిటర్లు తమ వల్ల కావడం లేదని చెబుతున్నారు.

ప్రస్తుతం సింగిల్‌ థియేటర్లకు సినిమా విడుదల చేసే సమయంలో ఒప్పందాలు చేసుకుంటున్నారు. మల్టిఫ్లెక్స్‌కు షేరు విధానం అమలు చేస్తున్నారు. అద్దె ప్రతిపాదన వలన ఆర్థికంగా నష్టపోతున్నట్లు సింగిల్‌ థియేటర్లు నిర్వాహకులు వాపోతున్నారు. భారీ బడ్జెట్‌ చిత్రాల విడుదల చేసినా కొన్ని రోజుల వరకు రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. దీని వలన డి్రస్టిబ్యూటర్లు, నిర్మాతకు మాత్రమే ప్రయోజనం జరుగుతుందని, తమకు న్యాయం జరగటం లేదని చెబుతున్నారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement