‘ఆమెపై హత్యాచారానికి తెగబడ్డారు’

Narayan Rane Responds On Disha Salians Case - Sakshi

నారాయణ్‌ రాణే సంచలన ఆరోపణలు

ముంబై : బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ మేనేజర్‌ దిశా సలియన్‌ది ఆత్మహత్య కాదని ఆమెపై లైంగిక దాడి జరిపి హత్య చేశారని మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే ఆరోపించారు. దిశా అటాప్సీ రిపోర్ట్‌లో ఆమె ప్రైవేట్‌ భాగాలపై గాయాల మరకలున్నాయని వెల్లడైందని పేర్కొన్నారు. దిశా, రాజ్‌పుత్‌ల మరణాల కేసుల్లో దోషులను కాపాడేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ నేత రాణే ఆరోపించారు. దిశా కుటుంబంపై ఒత్తిడి తెస్తుండటంతో వారు ఆమె మృతిపై విచారణ కోరడం లేదని రాణే పేర్కొన్నారు. జూన్‌ 13 రాత్రి నటుడు దినోమోరియా నివాసంలో పార్టీ జరిగిందని, ఆ తర్వాత పార్టీకి హాజరైన వారు సుశాంత్‌ ఇంటికి వెళ్లారని రాణే చెప్పారు.

ఈ పార్టీకి ఓ రాజకీయ నేత కూడా హాజరయ్యారని పేర్కొన్నారు. కాగా విశ్వసనీయ సమాచారం ఉండటంతోనే తన తండ్రి ఈ ఆరోపణలు చేసి ఉంటారని ఆయన కుమారుడు, బీజేపీ నేత నితీష్‌ రాణే అన్నారు. త్వరలోనే తాము ఈ వివరాలను సంబంధిత అధికారుల ఎదుట వెల్లడిస్తామని చెప్పారు. సుశాంత్‌ మృతిపై వాస్తవాలు వెలుగులోకి రాకుండా కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా జూన్‌ 14న సుశాంత్‌ విషాదాంతానికి ముందురోజు సుశాంత్‌ ఇంట్లో పార్టీ జరిగిందనే ఆరోపణలను ముంబై పోలీస్‌ చీప్‌ పరంవీర్‌ సింగ్‌ గతంలో తోసిపుచ్చారు. మరోవైపు సుశాంత్‌ మృతిపై అతడి గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. సుశాంత్‌ తండ్రి ఫిర్యాదుపై ముంబై చేరుకున్న బిహార్‌ పోలీసులు ఈ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.

చదవండి : సుశాంత్‌ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top