ముంబై వేదికగా ప్రపంచ హిందూ కాంగ్రెస్‌ | Mumbai to host World Hindu Congress from 18 December 2026 | Sakshi
Sakshi News home page

ముంబై వేదికగా ప్రపంచ హిందూ కాంగ్రెస్‌

Oct 9 2026 6:27 AM | Updated on Oct 9 2026 6:27 AM

Mumbai to host World Hindu Congress from 18 December 2026

డిసెంబర్‌ 18–20 తేదీల్లో జరగనున్న సభలు

ప్రారంభించనున్న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌

ముంబై: నాలుగో ప్రపంచ హిందూ కాంగ్రెస్‌కు ముంబై నగరం ఆతిథ్యమివ్వనుంది. డిసెంబర్‌ 18, 19, 20వ తేదీల్లో జరిగే ఈ సభలు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ప్రారంభోపన్యాసంతో మొదలు కానున్నాయి. 

‘సమానమ్‌ వ్రతమ్‌ సహ చిత్తం(ఒకటే మాట–ఒకటే లక్ష్యం) ఇతివృత్తంతో జరిగే ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ నాయకులు, సంస్థలు పరస్పరం అనుసంధానమవ్వడానికి, చర్చలు జరపడానికి, కలిసి పనిచేయడానికి ఒక అంతర్జాతీయ వేదికగా ఉంటుందని నిర్వాహకులు వివరించారు.

 ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాలకు చెందిన హిందూమత నేతలు, ఆలోచనావేత్తలు, వివిధ హిందూ సంస్థల ప్రతినిధులు కలిసి 4 వేల మందికి పైగా ఈ మూడురోజుల సమావేశాల్లో పాలుపంచుకోనున్నారు. ధర్మం, సమాజం, విశ్వకర్త, భాష అనే అంశాలపై నాలుగు ప్రత్యేక ప్లీనరీ సమావేశాలతో సుమారు 45 సెషన్లలో 150 మందికి పైగా వక్తల ప్రసంగాలుంటాయి.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement