ములాయం హెల్త్‌ కండీషన్‌ సీరియస్‌.. హుటాహుటిన ఆసుపత్రికి అఖిలేష్‌! | Sakshi
Sakshi News home page

Mulayam Singh: ములాయం హెల్త్‌ కండీషన్‌ సీరియస్‌.. హుటాహుటిన ఆసుపత్రికి అఖిలేష్‌!

Published Sun, Oct 2 2022 5:33 PM

Mulayam Singh Health Condition Critical Adimited In Hospital - Sakshi

Mulayam Singh.. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్(82) ఆరోగ్య విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ములాయంను గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. 

అయితే, కొద్దిరోజులుగా పలు రకాల ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటున్న ములాయం సింగ్‌ ఆరోగ్య పరిస్థితి ఆదివారం విషమంగా మారిందని వైద్యులు తెలిపారు. కాగా, మూలయంకు డాక్టర్‌ సుశీల కటారియా ఆధ్వర్యంలో వైద్య చికిత్స జరుగుతోందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఇక, ములాయం సింగ్‌ హెల్త్‌ కండీషన్‌ గురించి తెలుసుకున్న అఖిలేష్‌ యాదవ్‌ హుటాహుటిన ఢిల్లీ నుంచి ఆసుపత్రికి చేరుకున్నట్టు సమాచారం. 

Advertisement
 
Advertisement
 
Advertisement