
లక్నో:నెల పాటు పరారీలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ కైష్ ఖాన్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. దాదాపూ నెల రోజు పాటు పరారీలో ఉన్న ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ ఎస్పీ అధ్యక్షుడు,మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సన్నిహితుడు కైష్‌ఖాన్‌పై ఐదు కేసులు నమోదయ్యాయి. వాటిల్లో పురావస్తు శాఖకు చెందిన భూమిని అక్రమంగా ఆక్రమించారనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
గతంలో అనేక వివాదాలకు కైష్‌ఖాన్ కేంద్ర బిందువుగా నిలిచారు. దీంతో చట్టప్రకారం చర్యలు తీసుకున్నారు. నిబంధనల మేరకు.. కైష్‌ఖాన్ సొంత జిల్లాలో ఉండకూడు. అయినప్పటికీ పోలీసుల కళ్ళు గప్పి తన సొంత జిల్లాలో ఉంటున్నారు. ఈ క్రమంలో నెల రోజుల నుంచి కైష్‌ఖాన్ గురించి పోలీసులు అన్వేషిస్తున్నారు.
తాజాగా కైష్‌ఖాన్ ఆచూకీపై సమాచారం అందడంతో ఆయన ఇంట్లోనే పోలీసులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో అటకపై పరుపును అడ్డుగా పెట్టుకుని దాక్కున్న కైష్‌ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ప్రజలలో చర్చ జరుగుతోంది. రాజకీయ నాయకులు ఇలా పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Caught inside a mattress, watch how ex-Samajwadi Party leader was nabbed by police… pic.twitter.com/zoYpexcvt2
— Brut India (@BrutIndia) September 4, 2025