Sanjay Raut: పాములంటే భయం! ఏక్‌నాథ్‌ షిండే పై విమర్శల దాడి

MP Sanjay Raut Veiled Attack,  Eknath Shinde Faction As Snakes - Sakshi

ముంబై: మహారాష్ట్రలో శివసేన పార్టీ అంతర్గత విభేదాలతో రెండుగా విడిపోయి అనుహ్య రాజకీయ అనిశ్చితికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఏకనాథ​ షిండే 39 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబావుటా ఎగరేసి బీజేపీ మద్దతుతో అనుహ్యంగా మహారాష్ట్ర సీఎంగా భాద్యతలు చేపట్టారు. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం పెరుతూనే వస్తుంది. ఈ నేపథ్యంలోనే శివసేనకు చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌, ఏక్‌నాథ్‌ షిండే వర్గాన్ని పాములుగా అభివర్ణించారు.

ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఏక్‌నాధ్‌ షిండ్‌ వర్గాన్ని ఉద్దేశించి...సరదాలను కూడా చితకబాదే నైపుణ్యం నేర్చుకోండి. పాముల భయంతో అడవిని వదలకండి. జై మహారాష్ట్ర అని విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు. ఉద్ధవ్‌ ఠాకక్రే నేతృత్వంలో శివసేన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది మహారాషష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేతో టచ్‌లో ఉండటంతో మరోసారి శివసేన వర్గానికి పెద్ద షాక్‌ తగలిన నేపథ్యంలోనే ఈ ట్వీట్‌ చేశారు.

షిండే ఈ విషయాన్ని వెల్లడించే అవకాశం ఉందని కూడా అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అదీగాక షిండే సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో 18 మంది శివసేన లోక్‌సభ ఎంపీలు బుధవారం తనను కలుస్తారనే నమ్మకం ఉందని అన్నారు. మరోవైపు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి సంబంధించి శివసేనకు చెందిన రెండు వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లను బుధవారం సుప్రీం కోర్టు విచారించనుంది.

(చదవండి: శాసన సభను కౌరవ సభగా మార్చొద్దు!.. ఎమ్మెల్యే ముఖం చింపాంజీ కటౌట్‌తో నిరసన)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top