జిల్లా కలెక్టర్‌ గ్లాసెస్‌ ఎత్తుకెళ్లిన వానరం.. తర్వాత ఏం జరిగిందంటే?

Monkey Snatches District Magistrate Glasses In UP Town Mathura - Sakshi

లక్నో: ఒక జిల్లాకు కలెక్టర్‌ అధిపతి. జిల్లాలో ఆయనను మించిన పవర్‌ఫుల్‌ వ్యక్తి మరొకరు ఉండరు. అయితే, అలాంటి వ్యక్తికే ఝలక్‌ ఇచ్చింది ఓ కోతి. చుట్టూ పదుల సంఖ్యలో పోలీసులు, స్థానికులు ఉన్నప్పటికీ కలెక్టర్‌ కంటి అద్దాలను ఎత్తుకెళ్లి తానేంటో చూపించింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌, మథురాలోని బృందావన్‌ నగరంలో వెలుగు చూసింది. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. 

జిల్లా మెజిస్ట్రేట్‌ నవనీత్‌ చాహల్‌ గ్లాసెస్‌ను ఎత్తుకెళ్లిన వానరం దృశ్యాలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు భారత అటవీ సర్వీసెస్‌(ఐఎఫ్‌ఎస్‌) అధికారి సుశాంత నంద. కలెక్టర్‌ నవనీత్‌ చాహల్‌, పలువురు పోలీసులు ఓ భవనం వద్ద గుమిగూడి కోతి నుంచి గ్లాసెస్‌ ఎలా తెచ్చుకోవాలో ప్రయత్నిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ఆ భవనం గోడలపై ఇతర కోతులు సైతం ఉన్నాయి. కొద్ది సేపు బుజ్జగించిన తర్వాత కంటి అద్దాలను తిరిగి ఇచ్చేసింది ఆ వానరం.  ‘భారత్‌లోని ఓ జిల్లాలో డిస్ట్రిక్ట్‌ మెజిస్టేట్‌ను మించిన పవర్‌ఫుల్‌ వ్యక్తి ఉండడు. బృందావన్‌లో డీఎం నవనీత్‌ చాహల్‌ అద్దాలను కోతీ ఎత్తుకెళ్లింది. కొద్ది సమయం బుజ్జగించిన తర్వాత తిరిగి ఇచ్చేసింది’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు సుశాంత నంద.

ఇదీ చదవండి: మెడలో విష సర్పంతో అతిచేష్టలు.. నిండు ప్రాణం బలి!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top