బాలికల బాల్యానికి భద్రతేది?.. సర్వేలో విస్తుపోయే నిజాలు

Molestation Cases Minor Girls Increases In Bangalore Says Survey - Sakshi

సాక్షి, బెంగళూరు: ప్రశాంత కన్నడనాట నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా మైనర్‌ బాలికలపై అత్యాచారాలు, బాల్య వివాహాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2018–2021 మధ్య రాష్ట్రంలో ఈ కేసుల సంఖ్య ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలదీ అదే బాట. ఇటీవల జరిగిన బెళగావి అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రభుత్వం దీనిని అంగీకరించింది.  

ఈ ఏడాది 25 శాతం అధికం  
► 2018లో మైనర్లపై మొత్తం 1,410 అత్యాచార ఘటనలు జరిగినట్లు నమోదు కాగా, 2021లో ఆ సంఖ్య 25 శాతం పెరిగి 1,761 కి చేరింది. అసలు లెక్కల్లోకి రాని కేసుల సంఖ్య ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా ఉండొచ్చని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.  
►  బాల్య వివాహాలు అయితే 200 శాతం పెరిగాయి. 2018లో కేవలం 74 బాల్య వివాహాలు నమోదు అయితే ఆ సంఖ్య ఈ ఏడాది 223కు పెరిగింది.  
► కరోనా లాక్‌డౌన్‌లో స్కూళ్లు లేకపోవడంతో పిల్లలకు పెళ్లిళ్లు చేసి తమ బాధ్యతలను తీర్చుకోవాలని చాలా మంది గ్రామీణ తల్లిదండ్రులు ప్రయత్నించడం దీనికి కారణం.   

దౌర్జన్యాలదీ అదే తీరు   
►  మరోవైపు మైనర్లపై అత్యాచారమే కాకుండా ఇతరత్రా దాడులు కూడా జరిగాయి. బాలలపై దౌర్జన్యాలు 8 శాతం పెరిగాయి.  
►  మహిళలపై జరిగే అత్యాచారాలు 4 శాతం పెరిగాయి. 2018లో మహిళలపై అత్యాచారానికి సంబంధించి 486 కేసులు నమోదు కాగా, 2021లో ఆ సంఖ్య 507కి పెరిగింది.  
►  ఇక బాలల సంరక్షణ చట్టం (జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌) కింద నమోదయ్యే కేసులు కూడా కొంచెం పెరిగాయి. ఈ చట్టం కింద 2018లో 50 కేసులు నమోదయితే 2021లో ఆ సంఖ్య 67కి చేరింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top