కూరగాయలు అమ్మె అమ్మ కాళ్లుపట్టుకున్న మంత్రి! ఎందుకంటే..

Minister Says Sorry Elderly Woman Gets Himself Slapped At Gwalior - Sakshi

కూరగాయలు అమ్ముకొని జీవించే బామ్మకు ఓ మంత్రి క్షమాపణలు చేప్పారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు విషయం ఏమిటంటే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ నగరంలో రోడ్డుపై రద్దీ పెరుగుతున్న కారణంగా స్థానికంగా ఉండే ఓ కూరగాయల మార్కెట్‌ను అధికారులు మరోచోటుకి తరలించబోయారు.

ప్రస్తుత మార్కెట్‌ను పరిశీలించడానకి అక్కడికి రాష్ట్ర ఇంధన వనరులశాఖ మంత్రి ప్రద్యుమ్న సింగ్‌ వచ్చారు. మంత్రిని చూసిన బాబినా బాయ్‌ అనే కూరగాయలు అమ్ముకునే వృద్ధురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు ఉపాధి కలిగించే మార్కెట్‌ను మరో చోటుకు తరలించడంపై ఆమె కన్నీరు పెట్టుకుంది. అయితే ఆమెను శాంతింపజేయడానకి మంత్రి.. రోడ్డు, మార్కెట్‌ పరిస్థితిని వివరించాడు.

అంతటితో ఆగకుండా కూరగాయలు అమ్ముకునే వారికి కలిగిస్తున్న అసౌకర్యానికిగాను ఆమె కాళ్లు పట్టుకొని క్షమించమని అడిగారు. మార్కెట్‌ తరలింపు వల్ల ఇబ్బంది పెడుతున్నామని.. ఆమె చేతులు పట్టుకొని చెంపలపై కొట్టించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వృద్ధురాలికి మంత్రి క్షమాపణ చేప్పి.. తన గొప్ప మనసు చాటుకున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top