రాష్ట్రప్రభుత్వం సరైన పత్రాలు సమర్పించలేదు: కిషన్‌రెడ్డి | Minister Kishan Reddy Comments On TS Govt Over SDRF Funds | Sakshi
Sakshi News home page

రాష్ట్రప్రభుత్వం సరైన పత్రాలు సమర్పించలేదు: కిషన్‌రెడ్డి

Jul 19 2022 1:05 AM | Updated on Jul 19 2022 1:05 AM

Minister Kishan Reddy Comments On TS Govt Over SDRF Funds - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎస్డీఆర్‌ఎఫ్‌ నిధుల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సరైన పత్రాలు సమర్పించలేదని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే తెలంగాణకు ఎస్డీఆర్‌ఎఫ్‌ నిధులను కేంద్రం కేటాయించినప్పటికీ, మొదటి విడత నిధులను విడుదల చేయడానికి అవసరమైన యుటిలై జేషన్‌ సర్టిఫికెట్లను రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకు అందించలేదన్నారు.

ఈ సర్టిఫికెట్లు అందిన వెంటనే నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ మేరకు సోమవారం కిషన్‌రెడ్డి ఒక మీడియా ప్రకటన విడుదల చేశారు. గోదావరి నది కి వచ్చిన వరదలతో తెలంగాణ, ఏపీలోని ప్రజలకు జరిగిన నష్టాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.   

Advertisement
 
Advertisement
Advertisement