యూపీలో కాలువలో పడిన కారు.. ముగ్గురు మృతి.. మరో ముగ్గురు గల్లంతు! | Many People Died and Injured After Car Fell Into Canal | Sakshi
Sakshi News home page

Uttar Pradesh: కాలువలో పడిన కారు.. ముగ్గురు మృతి.. మరో ముగ్గురు గల్లంతు

Mar 4 2024 7:22 AM | Updated on Mar 4 2024 7:22 AM

Many People Died and Injured After Car Fell Into Canal - Sakshi

యూపీలోని బులంద్‌షహర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో తిరిగి వస్తున్న కారు వర్షం కారణంగా కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు గాయపడినట్లు సమాచారం. అలాగే ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియడంలేదు.  వీరిని గాలించేందుకు రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎనిమంది మంది ప్రయాణిస్తున్నారు. 

ఆదివారం అర్థరాత్రి దాటాక జహంగీరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కప్నా కాలువలో కారు పడిపోయింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే డీఎం, ఎస్‌ఎస్పీ, ఇతర పోలీసు అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  అధికారులను అప్రమత్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement