60 ఏళ్ల వృద్ధుడు ఖననం చేసేశాక..హఠాత్తుగా బతికే ఉన్నానంటూ..

Mans Friend Shocked Video Call Days After His Burial At Maharashtra  - Sakshi

మహారాష్ట్రలో వింత ఘటన చోటు చేసుకుంది. 60 ఏళ్ల వృద్ధుడు అంత్యక్రియలు అయిపోయాక బతికే ఉన్నానంటూ స్నేహితుడికి కాల్‌ చేశాడు. దీంతో ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు బంధువులు. వారు ఈ విషయాన్ని పోలీసులకి తెలపడంతో ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. వివరాల్లోకెళ్తే..మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో 60 ఏళ్ల ఆటో డ్రైవర్‌ రిఫీక్‌ షేక్‌ అనే వృద్ధుడు కొద్దినెలల క్రితం తప్పిపోయాడు. దీని గురించి కుటుంబసభ్యులు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు కూడా.

ఐతే జనవరి 29న బోయిసర్ మరియు పాల్ఘర్ స్టేషన్ల మధ్య ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. దీంతో రైల్వే పోలీసులు అతడి ఫోటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీన్ని చూసిన ఒక వ్యక్తి రైల్వే పోలీసులను సంప్రదించి అతను తన సోదరుడు రఫీక్‌ షేక్‌ అని చెప్పాడు. అతను తప్పిపోయినట్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిపాడు. ఆ తర్వాత రఫీక్‌ భార్య సైతం మృతి చెందింది తన భర్తే అని గుర్తిచడం విశేషం.

దీంతో పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కుంటుంబికులు ఆ మృతదేహాన్ని ఖననం చేసేశారు కూడా. ఇంతలో రఫీక్‌ తన స్నేహితుడికి బతికే ఉన్నానంటూ సడెన్‌గా కాల్‌ చేశాడు. దీంతో అతను ఒక్కసారిగా షాక్‌ తిన్నాడు. వీడియో కాల్‌ చేసి మాట్లాడేంత వరకు నమ్మలేకపోయాడు. ఈ విషయాన్ని అతను షేక్‌ కుటుంబికులకు చెప్పాడంతో వారు కూడా బిత్తరపోయారు. అతన్ని చూసి ఆ కుంటుంబం ఆనందానికి ఆవధులే లేకుండా పోయింది. అంతేకాదు వారు ఈ విషయాన్నిపోలీసులకు తెలియజేయడంతో వారు ఖననం చేసిన మృతదేహన్ని వెలికితీసి.. అతను ఎవరో కనిపెట్టి పని ప్రారంభించారు. ఆ వృద్ధుడు కొద్ది నెలల వరకు పాల్ఘర్‌లోని ఒక నిరుపేద ఇంటిలో ఉన్నట్లు సమాచారం.

(చదవండి: తాజ్‌మహల్‌ని చూసి మంత్రముగ్దులయ్యి ముషారఫ్‌ ఏం అన్నారంటే..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top