తాజ్‌మహల్‌ని చూసి మంత్రముగ్దులయ్యి ముషారఫ్‌ ఏం అన్నారంటే..

Pervez Musharraf Seeing Taj Mahal Asked That Question  - Sakshi

పాక్‌ మాజీ అధ్యక్షుడు దివంగత పర్వేజ్‌ ముషారఫ్‌ 2001లో అప్పటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఆగ్రా సమ్మిట్‌ కోసం భారత్‌ని సందర్శించారు. అప్పుడు ఆయన తన సతీమణితో కలిసి ఆగ్రాలోని ప్రేమకు స్మారక చిహ్నం అయిన తాజ్‌మహల్‌ని సందర్శించారు. ముషారఫ్‌ తాజ్‌ మహల్‌ నిర్మాణ అద్భుతానికి ఎంతగానో మంత్ర ముగ్దులయ్యారు. ఆ స్మారక చిహ్నాన్ని చూసినప్పుడూ ఆయన అడిగిన మొదటి ప్రశ్న గురించి చెబుతూ.. నాటి సంఘటనను పురావస్తు శాస్తవేత్త కెకె మహ్మద్‌ గుర్తు చేసుకున్నారు.

ముషారఫ్‌ తాజ్‌మహల్‌ సందర్శించడానికి వచ్చినప్పుడు మహ్మద్‌ పురావస్తు శాఖలోని ఆగ్రా సర్కిల్‌కు సూపరింటెండ్‌ ఆర్కియాలజిస్ట్‌గా ఉన్నారు. ముషారఫ్‌ తాజ్‌మహల్‌ని చూసిన వెంటనే దీన్ని ఎవరూ రూపొందించారు అని మహ్మద్‌ని ప్రశ్నించారు. బహుశా ఆయన నేను షాజహాన్‌ అని చెబుతానని అనుకుని ఉండోచ్చు, కానీ నేను ఉస్తాద్‌ అహ్మద్‌ లాహోరీ అని చెప్పానన్నారు మహ్మద్‌. ఎందుకంటే ఉస్తాద్‌ లాహోర్‌కి చెందినవాడు. ముషారఫ్‌కి ఆ ప్రేమ స్మారక చిహ్నం విశిష్టత గురించి చెప్పేందుకు మహ్మద్‌ని టూరిస్ట్‌ గైడ్‌గా నియమించారు.  ఈ స్మారక చిహ్నం ఆప్టికల​ ఇల్యూషన్‌ గురించి కూడా చెప్పినట్లు మహ్మద్‌ గుర్తు చేసుకున్నారు. అంతేగాదు ముషారఫ్‌ తనని తాజ్‌మహల్‌ని చూడటానికి ఉత్తమమైన సమయం ఎప్పుడూ అని కూడా ప్రశ్నించినట్లు తెలిపారు.

సూర్యుని కిరణాలు ఆ స్మారక కట్టడంపై పడగానే పాలరాతి మహల్‌ కాస్తా ధగధగ మెరుస్తుందని, అలాగే వర్షం కురిసినప్పుడూ బాధగా విలపిస్తున్నట్లు కనిపిస్తుందని చెప్పినట్లు తెలిపారు. అంతేగాదు తాను ముంతాజ్‌, షాజహాన్‌ల వివాహం లాహోర్‌ కోటలో జరిగిందని, మొఘల్‌ చక్రవర్తి జన్మస్థలం కూడా అదేనని చెప్పడంతో ముషారఫ్‌ ఒక్కసారిగా తాను తనవారి ఇంట్లో ఉన్నట్లు భావించారని చెప్పారు మహ్మద్‌.

వాస్తవానికి మహ్మద్‌ ఆ తాజ్‌మహల్‌ని చూడటానికి 45 నిమిషాల సమయం ఇచ్చాం గానీ కానీ ఆయన తన భార్యతో కలిసి కాసేపు వ్యక్తిగతంగా గడిపేలా మరో 15 నిమిషాలు పొడిగించినట్లు మహ్మద్‌ నాటి సంఘటనను వివరించారు. కాగా, ముషారఫ్‌ సెప్టెంబర్‌ 25, 2006న తాను రచించిన ఇన్‌ ది లైన్‌ ఆఫ్‌ ఫైర్‌ ఏ మెమోరియల్‌ పుస్తకంలో ఈ తాజ్‌మహల్‌ గురించి ప్రస్తావించారు. అందులో ..ఆగ్రా అనేది తాజ్‌మహల్‌ స్మారక ప్రదేశం. ఇది ప్రేమకు సంబంధించిన మొఘల్‌ స్మారక చిహ్నం. ఈ  కట్టడం అతీతమైన అందం కారణంగానే ప్రపంచంలోని అద్భుతాలలో ఒకటిగా నిలించింది అని ముషారఫ్‌ పుస్తకంలో పేర్కొన్నారు. 

(చదవండి: జెలెన్‌స్కీని చంపేందుకు ప్లాన్‌ చేస్తున్నారా? పుతిన్‌ ఏమన్నారంటే..)

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top