Manish Sisodia: నా బ్యాంకు లాకర్‌ని కూడా సీబీఐ తనీఖీ చేయనుంది! మనీష్ సిసోడియా

న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పై సీబీఐ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇపుడు తాజగా మంగళవారం ఆయన బ్యాక్ లాకర్‌ను కూడా సీబీఏ తనీఖీ చేయనుందని తెలిపారు. ఐతే సీబీఏ ఏమి కనుగొనలేదని ధీమాగా చెప్పారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సుమారు 15 మంది వ్యక్తులు, సంస్థల పై కేసు నమోదు చేసింది.
ఈ అభియోగాలతో ఆగస్టు19న ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ సిసోడియా నివాసంతో సహా సుమారు 31 ప్రదేశాల్లో దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో సిసోడియా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 19న తన ఇంటిలో సుమారు 14 గంటల పాటు సీబీఐ నిర్వహించిన దాడుల్లో వారికి ఏమి దొరకలేదు, కాబట్టి ఇప్పడు కూడా వారికి ఏమి దొరకదు అని నమ్మకంగా చెప్పారు. తాను సీబీఐని స్వాగతిస్తున్నానని, తాను తన కుటుంబసభ్యులు విచారణకు పూర్తిగా సహకారం అందిస్తాం అని డిప్యూటి సీఎం సిసోడియా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
कल CBI हमारा बैंक लॉकर देखने आ रही है. 19 अगस्त को मेरे घर पर 14 घंटे की रेड में कुछ नहीं मिला था. लॉकर में भी कुछ नहीं मिलेगा.
CBI का स्वागत है. जाँच में मेरा और मेरे परिवार का पूरा सहयोग रहेगा.
— Manish Sisodia (@msisodia) August 29, 2022
(చదవండి: కేంద్ర ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపిస్తాం! మమత స్ట్రాంగ్ వార్నింగ్)