ఫ్యాషన్ బ్యాంగిల్స్ ధరించిందని భార్యను బెల్టుతో చితకబాది..

Man Thrashes Wife With Belt For Wearing Fashionable Bangles - Sakshi

ముంబయి: నవీ ముంబయిలో అమానవీయ ఘటన జరిగింది. ఫ్యాషన్ బ్యాంగిల్స్ ధరించినందుకు భార్యను చితకబాదాడో వ్యక్తి. అత్త, మరో బంధువు కూడా ఇందులో పాలుపంచుకున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో భర్తతో పాటు మరో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు.   

నవీ ముంబయిలో నివాసం ఉంటున్న ప్రదీప్ అర్కడే(30) భార్య, అతని అమ్మతో కలిసి నివసిస్తున్నాడు. ఫ్యాషన్ బ్యాంగిల్స్ వేసుకోకూడదని  భార్యపై  ఆంక్షలు విధించేవాడు. ఈ క్రమంలో నవంబర్ 13న ఆమె ఆ బ్యాంగిల్స్‌ను ధరించింది. దీనిపై ఇరువురు వాగ్వాదానికి దిగారు. అనంతరం ప్రదీప్ తన భార్యను విచక్షణా రహితంగా కొట్టాడు. 

భర్త తనను బెల్ట్‌తో విచక్షణా రహితంగా కొట్టాడని పోలీసులకు  బాధితురాలు తెలిపింది. అత్త తన జుట్టు పట్టి పలుమార్లు చెంపపై కొట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది. మరో బంధువు కూడా తనను కిందపడేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన తర్వాత బాధితురాలు తన తండ్రి ఉంటున్న పుణెకి వెళ్లింది. అక్కడే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి నవీ ముంబయికి బదిలీ చేశారు. 

ఇదీ చదవండి: హర్యానా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానిక రిజర్వేషన్‌ చట్టాన్ని కొట్టేసిన హైకోర్టు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top