రైల్వే ట్రాక్‌పై శునకాన్ని కాపాడిన యువకుడు.. నెటిజన్లు ఫిదా!

A Man In Mumbai Rescuing Dog From Railway Tracks Video Viral - Sakshi

ముంబై: రైలు పట్టాలపై ఉన్న శునకాన్ని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి కాపాడాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్ల వైరల్‌గా మారాయి. ఈ సంఘటన ముంబైలోని ఓ రైల్వే స్టేషన్‌లో జరిగింది. ముంబై మేరీ జాన్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. ప్రాణాలకు తెగించిన నిఖిల్‌ లోఖండేను అభినందించారు నెటిజన్లు. 4.88 లక్షల వ్యూస్‌, 31వేల లైకులు వచ్చాయి. 

వీడియోలో.. రైల్వే ట్రాక్‌పై ఏమీ తెలియనట్లు నడుచుకుంటూ వెళ్తోంది ఓ శునకం. ఎదురుగా ట్రైన్‌ వస్తోంది. కుక్కను గమనించిన నిఖిల్‌ లోఖండే.. ట్రైన్‌కు వ్యతిరేంకంగా పరుగెత్తాడు. ట్రైన్‌ నెమ్మదిగా వస్తున్న క్రమంలో నిలిపేయాలని సైగ చేశాడు. కుక్కను ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న వారికి అందించాడు. ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంత పరిధిలోని నల్లాసపోరా ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు పలువురు నెటిజన్లు తెలిపారు. శునకాన్ని కాపాడిన అఖిల్‌పై ప్రశంసలు కురిపించారు.

ఇదీ చదవండి: ‘2014లో మాదిరిగా 2024లో గెలుస్తారా?’.. ప్రధాని మోదీకి నితీశ్‌ సవాల్‌!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top