ప్రియురాలికి న్యాయం చేయాలంటూ భవనంపై నుంచి దూకేశాడు

Man Jumped From 6th Floor Of Maharashtra Mantralaya In Mumbai - Sakshi

పుణె: 43 ఏళ్ల వ్యక్తి  ప్రియురాలికి న్యాయం చేయాలంటూ ఆరో అంతస్తు నుంచి దూకేశాడు. ఈ ఘటన దక్షిణ ముంబైలోని మహారాష్ట్ర హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న ప్రభత్వ ప్రధాన కార్యాలయం అయిన మంత్రాలయ భవనం వద్ద చోటు చేసుకుంది.  అదృష్టవశాత్తు సదరు వ్యక్తి సేఫ్టి నెట్‌లో పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు తెలిపన కథనం ప్రకారం....బీడు జిల్లాకు చెందిన బాపు నారాయణ మోకాషి తన గర్లఫ్రెండ్‌కి న్యాయం చేయాలని కోరుతూ కార్యాలయం పై నుంచి దూకేశాడు.

అతని గర్లఫ్రెండ్‌ అత్యాచారానికి గురైందని, ఆ తర్వాత ఆమె అవమానంతో 2018లో ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అప్పటి నుంచి సదరు వ్యక్తి తన ప్రియురాలికి న్యాయం జరగాలంటూ పోలీస్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఐతే పోలీసులు సరిగా దర్యాప్తు జరపకుండా జాప్యం చేస్తున్నారంటూ ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. అదీగాక  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండ్‌ని కలిసి ఈ విషయం చెప్పి న్యాయం చేయాలని అభ్యర్థించేందుకు నవంబర్‌ 17 గురువారం మంత్రాలయం ప్రభుత్వ కార్యాలయానికి వచ్చాడు.

ఐతే క్యాబినేట్‌ సమావేశం ఉండటంతో బాపుకి షిండేని కలిసే అవకాశం దక్కలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురై అతను మంత్రాలయం ప్రభుత్వ కార్యాలయం ఆరో అంతస్తు నుంచి దూకేశాడు. అక్కడ సేఫ్టి నెట్‌ ఉండటంతో అతను స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 

(చదవండి: కాలేజీ ర్యాగింగ్‌లో వికృతక్రీడ.. స్టూడెంట్‌ పైశాచికత్వం!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top