ఈ ఏడాది మధ్యప్రదేశ్‌లో 26 పులులు మృతి 

Madhya Pradesh Loses 26 Tigers In 2020 - Sakshi

భోపాల్‌: దేశంలో పులుల రాష్ట్రంగా పేరొందిన మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు 26 పులులు మరణించినట్లు నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ వెల్లడించింది. ఆరేళ్లలో పులుల సగటు మరణాల రేటుకన్నా జననాల రేటు ఎక్కువగా ఉందని మధ్య ప్రదేశ్‌ అటవీశాఖ మంత్రి తెలిపారు. 2019లో 28 పులులు మరణించాయి. ప్రస్తుతం మధ్య ప్రదేశ్‌లో 124 పులి పిల్లలున్నాయి. వచ్చే జంతు గణననాటికి 600 పులులుంటాయని మంత్రి తెలిపారు. కర్ణాటక అధిక పులులున్న రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉంది. ఈ ఏడాది అక్కడ 8 పులులు మరణించాయి. 2014లో కర్ణాటక(408), ఉత్తరాఖండ్‌(340)ల తర్వాత మధ్య ప్రదేశ్‌ (308)మూడో స్థానానికి పడిపోయింది. 2018 గణనలో మధ్యప్రదేశ్‌ తొలిస్థానానికి వెళ్ళింది.   చదవండి:  (పిలిభిత్‌ టైగర్‌ రిజర్వ్‌కు అవార్డు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top