ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా ప్రధాన కమాండర్‌ హతం

Lashkar E Taiba Terrorist Killed In Encounter In JK Day After Arrest - Sakshi

పరింపోరా ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటన

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని పరింపోరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాది, లష్కరే తోయిబా కమాండర్ నదీమ్ అబ్రార్ హతమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సోమవారం పరింపోరా చెక్‌పోస్ట్‌ వద్ద జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది వాహన తనిఖీ చేపట్టారు. ఈ సమయంలోనే ఓ కారును ఆపి చెక్‌ చేస్తుండగా వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి హ్యాండ్ గ్రానైడ్ విసిరేందుకు యత్నించాడు.

వెంటనే సీఆర్పీఎఫ్ బలగాలు అతడిని పట్టుకొని ముఖానికి ఉన్న ముసుగు తొలగించారు. అతడు లష్కరే తోయిబా టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ గుర్తించిన సీఆర్ఫీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకోని విచారించారు. దీనిలో భాగంగా ఆయుధాలు దాచిన ఇంటి గురించి తెలిపాడు. నదీమ్ అబ్రార్‌ను తీసుకోని ఆయుధాలు దాచిన ప్రదేశానికి వెళ్లారు సీఆర్పీఎఫ్ సిబ్బంది. అక్కడే దాక్కుని ఉన్న మరో ఉగ్రవాది భద్రతాదళాలపై కాల్పులు జరిపాడు. దీంతో బలగాలు కాల్పులు జరిపి ఇద్దరినీ అంతమొందించాయి. ఘటనాస్థలంలో అధికారులు ఓ ఏకే 47తోపాటు మరికొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో ముగ్గురికి గాయాలయ్యాయి. కాగా నదీమ్ అబ్రార్ అనేక హత్యకేసులో నిందితుడిగా ఉన్నారు.

చదవండి: ఆ డ్రోన్లు జారవిడిచిన బాంబుల్లో ఆర్డీఎక్స్‌!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top