Kerala: మండి బిర్యానీ తిని యువతి మృతి.. వారంలో రెండో ఘటన

Kerala Woman Dies After Eating Biryani, Probe Orders - Sakshi

కేరళలోని కొట్టాయంలో ఇటీవల(డిసెంబర్‌ 29) ఓ ఈవెంట్‌లో ఆహారం తిని నర్సు అస్వస్థతకు గురై చనిపోయిన విషయం తెలిసిందే. ఫుడ్‌ పాయిజన్‌ కారణంగానే ఆమె మరణించినట్లు వార్తలు వినిపించాయి. ఈ ఘటన జరిగిన వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో మరో విషాదం చోటుచేసుకుంది. మండి బిర్యానీ తిని 20 ఏళ్ల యువతి మృతిచెందింది.  ఈ ఘటన కూడా ఫుడ్‌ పాయిజనింగ్‌కు సంబంధించి అనుమానాస్పద కేసుగా అనుమానిస్తున్నారు.

వివరాలు.. కాసర్‌గోడ్‌ సమీపంలోని పెరుంబళకు ఎందిన అంజు శ్రీ పార్వతి డెసెంబర్‌ 31న రొమేనియా అనే రెస్టారెంట్‌ల నుంచి మండి బిర్యానీ (కుజిమంతి/కుళిమంతి) ఆర్డర్‌ చేసుకుంది. బిర్యానీ తిన్న తర్వాత అనారోగ్యానికి గురికావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.  అక్కడి నుంచి మంగళూరులోని మరో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించింది. బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.  

మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలంతో బాలిక తీసుకున్న ఆహారం, ఆమెకు అందించిన చికిత్సపై అధికారులు ఆరాతీస్తున్నారు. ఫుడ్‌ పాయిజనింగ్‌కు గురైన హోటళ్ల లైసెన్స్‌ను ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ యాక్ట్‌ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ) కింద రద్దు చేస్తామని తెలిపారు.
చదవండి: Video: బాప్‌రే..! డ్రెస్‌ బటన్లలో కొకైన్‌.. రూ. 47 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top