అయ్యో బిడ్డా! రన్నింగ్‌ బస్సుకు ఎదురెళ్లి.. కారణం తెలిస్తే కంగుతినడం ఖాయం!

Kerala Man Jumping Before moving bus breaks windshield Viral - Sakshi

వైరల్‌: నడిరోడ్డులో ఓ యువకుడు చేసిన పని.. విస్మయానికి గురి చేస్తోంది. రన్నింగ్‌ బస్సుకు ఎదురెళ్లి మరీ గుద్దుకునే యత్నం చేశాడతను. అతని తల బస్సు అద్దానికి తగిలి.. అదికాస్త బద్ధలయ్యింది. ఈ ప్రమాదం నుంచి.. 

ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. బస్సు డ్రైవర్‌ సమయస్ఫూర్తితో బ్రేకులు వేయడంతో అతనికి ప్రమాదం తప్పింది. కానీ, తల, కాళ్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. తొలుత ఆ యువకుడు కావాలని చేశాడనుకున్నారు స్థానికులు. కానీ, కారణం తెలిస్తే.. కంగు తినడం మీ వంతూ అవుతుంది కూడా!.

అయితే.. యువకుడు అంతటితోనే ఆగలేదు. కనీసం ఒంటిపై చొక్కా కూడా లేని ఆ యువకుడు తనకు తగిలిన గాయాలను లెక్కచేయకుండా పైకి లేచి.. తనను గుద్దిన బస్సులోకి ఎక్కి డ్రైవర్‌ సీట్లో కూర్చున్నాడు. స్టీరింగ్‌పై రక్తం కారుతున్న కాళ్లను ఆనించి.. ప్రయాణికులను కాసేపు టెన్షన్‌ పెట్టాడు. అతన్ని నిలువరించడం స్థానికులు, ప్రయాణికుల వల్ల కూడా కాలేదు.

దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. తొలుత దగ్గర్లో ఉన్న ఓ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. కేరళ మలప్పురం పెరింథాల్‌మన్నలోని జూబ్లీ జంక్షన్‌ వద్ద బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రాథమిక చికిత్స అనంతరం అతన్ని మానసిక స్థితి బాగోలేదని గుర్తించి.. తల్లిదండ్రుల్ని పిలిపించి మందలించారు. ఆపై వాళ్ల సాయంతో కోజికోడ్‌లోని మెంటల్‌ హెల్త్‌ సెంటర్‌కు యువకుడిని తరలించారు. 

ఈ ఘటనకు సంబంధించి ఓ ఆడియో క్లిప్‌ కూడా వైరల్‌ అవుతోంది. తాను బ్రెజిల్‌ జట్టు ఫుట్‌బాల్‌ ప్లేయర్‌నని, బస్సుకు ఉన్న బ్లూకలర్‌ చూసి అర్జెంటీనా టీం గుర్తుకు వచ్చిందని, ఆ కోపంతోనే అలా చేశానని గట్టి గట్టిగా అరిచాడు. అంతేకాదు.. బస్సు డ్రైవింగ్‌ సీట్‌లో కూర్చున్నాక.. నెయ్‌మర్‌తో సహా టీం సభ్యులంతా రావాలని డిమాండ్‌ చేస్తూ హల్‌ చల్‌ చేశాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top