Sakshi News home page

కేరళ గవర్నర్‌ సంచలన వ్యాఖ్యలు.. వారంతా నేరస్థులు..

Published Sun, Dec 17 2023 1:56 PM

Kerala Governor Slams Student Activists Amid Protest Calicut University - Sakshi

తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్‌ మ‍హహ్మద్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం కాలికట్ యూనివర్సిటీ సందర్శించిన క్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు గవర్నర్‌కు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. ఆయన వాహనాన్ని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు, నాయకులు అడ్డుకున్నారు. అయితే ఈ ఘటనపై గవర్నర్‌ ఆరీఫ్‌ సీరియస్‌ అయ్యారు. తనపై విద్యార్థులు దాడి చేయడానికి ప్రయత్నించారని వారంతా నేరస్థులు అని​ మండిపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన వారి వెనకాల ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ హస్తం ఉందని ఆరోపించారు. తనపై దాడి చేయించడానికి సీఎం విజయన్‌.. నిరసనకారులను ఉసిగొలిపాడని మండిపడ్డారు.

తనను అడ్డుకుని దాడి చేయడానికి ప్రయత్నించిన విద్యార్థులంతా నేరస్థులని, సీఎం వ్యక్తిగతంగా విద్యార్థులను తనపైకి నిరసకు దిగాలని సూచించినట్లు ఆరోపించారు. అయితే గవర్నర్‌ ఆరీఫ్‌.. పలు యూనివర్సిటీల్లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలు ఉన్న వ్యక్తులను వివిధ పదవులకు నామినెట్‌ చేస్తున్నరని ఆరోపణలు ఉన్నాయి. వాటి నేపథ్యంలో ఆయన కలికట్‌ యూనివర్సిటీ సందర్శనకు రావటంతో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు నిరసనకు దిగినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై స్పందించిన గవర్నర్‌.. తాను కేవలం రాష్ట్రపతికి మాత్రమే జవాబుదారినని వెల్లడించారు. అదీకాక తాను విద్యార్థుల ముసుగులో ఉ‍న్న నేరస్థులకు జవాబుదారి కాదని స్పష్టం చేశారు.

చదవండి: మతగురువు దారుణ హత్య.. పోలీసులపై గ్రామస్థుల ఆగ్రహం

Advertisement

What’s your opinion

Advertisement