విచారణకు కేజ్రీ డుమ్మా! | Kejriwal to skip second ED summons in Delhi excise policy | Sakshi
Sakshi News home page

విచారణకు కేజ్రీ డుమ్మా!

Dec 21 2023 4:43 AM | Updated on Dec 21 2023 4:43 AM

Kejriwal to skip second ED summons in Delhi excise policy - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకల కేసులో గురువారం విచారణకు రావాలన్న ఈడీ సమన్లను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి బేఖాతరు చేసినట్టు సమాచారం. బుధవారమే ఆయన పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో విపాసన ధ్యానం కోర్సులో చేరేందుకు వెళ్లినట్లు వార్తలొచ్చాయి.

‘‘ఆయన ఏటా చలికాలంలో విపాసనకు వెళ్తారని అందరికీ తెలుసు. అయినా ఈడీ కావాలనే ఇప్పుడు సమన్లు ఇచ్చింది’’ అని ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా అన్నారు. దీనిపై ఈడీ తదుపరి చర్యలేమిటనేది తెలియాల్సి ఉంది.  నవంబర్‌ 2న కేజ్రీవాల్‌ను ఈడీ విచారణకు పిలవగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందంటూ హాజరు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement