లిక్కర్‌ కేసు విచారణకు కవిత వర్చువల్‌ హాజరు | kavitha Liqour Case Hearing Adjourned In Delhi Court | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ కేసు: విచారణకు వర్చువల్‌గా హాజరైన కవిత

Aug 9 2024 12:19 PM | Updated on Aug 9 2024 1:24 PM

kavitha Liqour Case Hearing Adjourned In Delhi Court

సాక్షి,ఢిల్లీ: లిక్కర్‌స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ మీద ఢిల్లీ కోర్టులో శుక్రవారం(ఆగస్టు9) విచారణ జరిగింది. విచారణకు  కవిత సహా లిక్కర్ కేసు నిందితులు వర్చువల్‌గా హాజరయ్యారు. 

సీబిఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో పేజినేషన్ సరిగ్గా లేదని నిందితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నెల 14 వరకు ఛార్జ్‌షీట్‌లో సరిగ్గా పేజినేషన్ చేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. అనంతరం కేసును న్యాయమూర్తి కావేరి బవేజా ఆగస్టు 21కి వాయిదా వేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement