కర్ణాటకలో లైంగిక వేధింపులు.. హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు | Karnataka Home Minister Parameshwara Controversy Statement | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో లైంగిక వేధింపులు.. హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Apr 7 2025 1:53 PM | Updated on Apr 7 2025 2:59 PM

Karnataka Home Minister Parameshwara Controversy Statement

బెంగళూరు: కర్ణాటకలో ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపుల అంశంపై హోంమంత్రి జి పరమేశ్వర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.

బెంగళూరులోని వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను ఓ వ్యక్తి లైంగికంగా వేధించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా హోంమంత్రి జి పరమేశ్వర స్పందించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘పెద్ద నగరాల్లో అలాంటి ఘటనలు జరుగుతుంటాయి. నిరంతరం అప్రమత్తంగా ఉండమని నేను ప్రతీరోజు పోలీసులకు చెబుతూనే ఉంటాను. ఇటీవల జరిగిన ఓ ఘటనపై ఉదయం కూడా కమిషనర్‌తో మాట్లాడాను. ఇక్కడ కొన్ని ఘటనలు జరిగినప్పుడు ప్రజల దృష్టి వాటిపైకి మళ్లుతుంది. పోలీసులు 24X7 పనిచేస్తున్నారు. మేము చట్టం ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

హోంమంత్రి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కౌంటర్‌ ఇస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రశాంత్ మాట్లాడుతూ..‘హోంమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. ఇది చాలా సున్నితమైన విషయం. లైంగిక వేధింపులు, మహిళలపై నేరాలను ఆయన సాదారణ విషయంగా భావిస్తున్నారా?. ఇలా మాట్లాడి తన బాధ్యత నుండి ఆయన తప్పించుకుంటున్నారు.  జవాబుదారీగా ఉండటానికి ఇష్టపడటం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోతారు. కాంగ్రెస్‌ పాలనలో శాంతి భద్రత పరిస్థితులకు ఈ ఘటన అద్దం పడుతుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.

Bengaluru: ఫ్రెండ్ తోవెళ్తున్న యువతిపై వేధింపులు

Advertisement
 
Advertisement
Advertisement