‘ఆరోగ్యసేతు తప్పనిసరి కాదు’ 

Karnataka High Court: Aarogya Setu Cannot Be Mandatory By Govt For Now - Sakshi

శివాజీనగర: స్మార్ట్‌ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్‌ లేదనే కారణంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అనుబంధ సంస్థలు ప్రజలకు సేవలను నిరాకరించటానికి లేదని కర్ణాటక హైకోర్టు స్పష్టంచేసింది. కరోనా వైరస్‌ బాధితులపై నిఘా పెట్టే ఆరోగ్య సేతు మొబైల్‌ యాప్‌ను ప్రజలు స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకొని ఉండాలని రైల్వే, మెట్రోరైల్, ఆర్టీసీ వంటి పలు ప్రభుత్వ సంస్థలు షరతును విధించాయి. అరవింద్‌ అనే వ్యక్తి దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిల్‌ను దాఖలు చేశారు. కోర్టు స్పందిస్తూ ఆరోగ్యసేతు తప్పనిసరి కాదని పేర్కొంటూ, కేంద్రానికి అభ్యంతరాల దాఖలుకు అవకాశమిస్తూ విచారణను నవంబర్‌ 10కి వాయిదా వేసింది. చదవండి: ఆరోగ్య సేతులో మరో కొత్త ఫీచర్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top