వీడియో: జోష్‌తో డ్యాన్స్‌.. విధి ఇంత విచిత్రంగా ప్రాణం తీస్తుందా?

Kanpur Man Sudden Dies At MP Rewa Wedding Video Viral - Sakshi

వైరల్‌: ఏ నిమిషానినో ఏమి జరుగునో ఎవరూహించెదరు?.. మనిషి జీవం విషయంలో ఇప్పుడు ఇలాగే జరుగుతోంది. నిన్న కళ్లెదురుగా నవ్వుతూ హుషారుగా కనిపించిన మనిషి.. ఇవాళ బతికి లేడు అని వినాల్సి వస్తున్న రోజులువి. కన్నవాళ్లను, భార్యాబిడ్డలను, అయినవాళ్లను ఉన్నట్లుండి శోకంలో ముంచెత్తి వెళ్లిపోతున్నారు. పైగా ఉన్నట్లుండి కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు..అందునా పాతిక నుంచి నలభై ఐదేళ్లలోపు వాళ్ల మరణాలే అత్యధికంగా నమోదు అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. తాజాగా.. 

మధ్యప్రదేశ్‌లో ఓ పెళ్లింట నెలకొన్న విషాదం తాలుకా ఘటన వీడియో తెగ వైరల్‌ అవుతోంది. యూపీ కాన్పూర్‌కు చెందిన 32 ఏళ్ల అభయ్‌ సచాన్‌ను విధి విచిత్రంగా మరణంతో చుట్టుకెళ్లిపోయింది. అభయ్‌.. సోమవారం దగ్గరి బంధువుల వివాహం కోసం మధ్యప్రదేశ్‌ రేవాకు వచ్చాడు. మంగళవారం రాత్రి వివాహ వేడుకలో హుషారుగా డ్యాన్స్‌లు చేశాడు. అలా గంతులేస్తూనే ఉన్నట్లుండి.. నెమ్మదిగా కిందకు వాలిపోయాడతను. 

అది గమనించిన బంధువుల దగ్గరికి వెళ్లి చూసేసరికి.. అతనిలో ఎలాంటి చలనం లేదు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా.. కార్డియాక్‌ అరెస్ట్‌తో అప్పటికే కన్నుమూశాడని వైద్యులు ప్రకటించారు. పైగా షాకింగ్‌ విషయం ఏంటంటే.. అతను మద్యం మత్తులో లేడట. అతను పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడని వైద్యులు ప్రకటించడం. దీంతో ఆ యువకుడి మరణాన్ని ఎవరూ తట్టుకోలేకపోయారు. అలా పెళ్లింటి విషాదం నెలకొని.. అతని సంతాప సభను నిర్వహించాల్సి వచ్చింది.

సెలబ్రిటీలే కాదు.. ఇలాంటి మరణాలకు ఎవరూ అతీతులు కావడం లేదు. పదుల వయసున్న పిల్లల దగ్గరి నుంచి యుక్త వయసు కుర్రకారు కూడా ఇలాంటి మరణాల బారినపడుతోంది. వైద్య నిపుణులు సైతం ఇలాంటి మరణాలకు ఒక స్పష్టత అంటూ ఇవ్వలేకపోతుండగా.. అధ్యయనాలు మాత్రం రకరకాల నివేదికలను ఇస్తూ పోతోంది. 

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top